కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్రం కొత్తగా సహాయక సిబ్బందిని నియమించింది.
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్రం కొత్తగా సహాయక సిబ్బందిని నియమించింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్మన్ సంజయ్ కొఠారీని, ప్రెస్ కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయుడు అశోక్ మాలిక్‌ను కేంద్రం నియమించింది.
గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ అటవీ శాఖ అధికారి భరత్ లాల్‌ను సంయుక్త కార్యదర్శిగాను నియమించింది. ఈమేరకు కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగం శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకాన్ని ప్రధాని అధ్యక్షతన ఉండే కేబినెట్ నియామక కమిటీ కూడా వెంటనే ఆమోదించింది. కొత్తగా నియమితులైన వీరు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు.