కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ శారదా చిట్ స్కాం కేసులో ఎట్టకేలకు సీబీఐ ముందు హాజరయ్యారు. దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం కోల్‌కతాలో ఆయనను ఐదు గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దర్యాప్తుపై ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. అయితే సీబీఐ సమన్లు జారీ చేసినప్పుడు సహకరించాలి. అందుకే బాధ్యతగల పౌరుడిగా సీబీఐకి సహకరించాను. వాస్తవాలు బయటకు రావాలి. శారద కంపెనీలో డబ్బులు దాచుకున్న పేదలకు అన్యాయం జరగకూడదు’ అని అన్నారు.