
రోడ్డు ప్రమాదంలో స్మృతి ఇరానీకి గాయాలు
ఆగ్రా: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వల్పగాయాలయ్యాయి. యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీతో పాటూ, బీజేకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.
వ్రిందావన్లో తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కారులో ఢిల్లీ వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్మృతి ఇరానీ మోకాలుకు గాయమైనట్టు సమాచారం. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.