'సోషల్ మీడియాను టూల్ గా వాడతాం' | Social media is being used as a tool to bring transparency: Suresh Prabhu | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియాను టూల్ గా వాడతాం'

Published Thu, Feb 25 2016 12:45 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

'సోషల్ మీడియాను టూల్ గా వాడతాం' - Sakshi

'సోషల్ మీడియాను టూల్ గా వాడతాం'

న్యూఢిల్లీ: రైల్వేలో వంద శాతం పారదర్శకత సాధించడమే తమ లక్ష్యమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ను గురువారం లోక్‌సభలో ఆయన ప్రవేశపెట్టారు. పారదర్శకత కోసం సోషల్ మీడియా టూల్ కోసం వినియోగించుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. సామాజిక మాధ్యమం ద్వారా ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రయాణికులు, రైల్వేకు మధ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తామని చెప్పారు.

కోపరేషన్, కొలాబ్రేషన్, కమ్యూనికేషన్- తమ కొత్త నినాదంగా పేర్కొన్నారు. రైళ్ల రాకపోకల్లో సమయపాలన కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా 17 వేల బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 475 రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు కట్టిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement