దేశంలో విస్తారమైన వర్షాలకు కారణమయ్యే నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి.
తిరువనంతపురం : దేశంలో విస్తారమైన వర్షాలకు కారణమయ్యే నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో నైరుతి కేరళను రుతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోంచి జనం గొడుగుల సాయంతో బయట అడుగు పెట్టారు. సకాలంలో వర్షాలు రావడం పట్ల కేరళ రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.
మరో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నట్టు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా జూన్ మొదటి వారంలో కేరళలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు, జూలై మధ్య నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. మరోవైపు రాయలసీమ, తెలంగాణతో పాటు ఆంధ్రాలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.
monsoon hits Kerala, rains, IMD, రుతు పవనాలు, కేరళ, వర్షాలు