ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు నోటీసులు
వ్యక్తిగత సమాచార గోప్యతపై వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు అయిన వాట్సాప్, ఫేస్‌బుక్ లలో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), ఫేస్‌బుక్,వాట్సా ప్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు దేశంలోని 15 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యత లేకుండా చేస్తున్నాయంటూ దాఖలైనపిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ సామా జిక మాధ్యమాలు ఆర్టికల్19, 21 ప్రకారంరాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొ న్నారు. అనంతరం దీనిపై వివరణ ఇవ్వా లంటూ కేంద్రం, ట్రాయ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్ విషయంలోఅటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహాయాన్ని ధర్మాసనం కోరింది.