సుబ్రతారాయ్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్‌ని విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. సుబ్రతోరాయ్ ను బెయిల్ పై విడుదల చేయాలని తాజాగా ప్రతిపాదనలు సహారా గ్రూప్ చేసింది.
పదివేల కోట్ల రూపాయల చెల్లింపుపై అమోదకరమైన ప్రతిపాదనతో రావాలని మే 19 తేదిన జరిగిన విచారణలో సహారా గ్రూప్ నిర్వాహకులను సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్ బెయిల్ పై విడుదల కోసం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సహారా గ్రూప్ తాజాగా ఓ ప్రతిపాదనను సమర్పించింది.