న్యూఢిల్లీ: విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సీబీఎస్‌ఈ టెన్త్ బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై మానవ వనరుల అభివృద్ధిమంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పరీక్షలను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
5 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీతో పాటు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులూ విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారని, ఈ పరీక్షలు జరపాలంటున్నారని తెలిపారు. బోర్డు పరీక్ష తిరిగి ప్రవేశ పెట్టడంపై హెచ్‌ఆర్డీ మంత్రి అధ్యక్షతన ఈ నెల 25న జరిగే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నో-డిటెన్షన్ విధానం వల్ల ప్రమాణాలు దిగజారాయనే ఆందోళన వ్యక్తమవుతోందని హెచ్‌ఆర్డీ అధికారి ఒకరు చెప్పారు.
మళ్లీ సీబీఎస్‌ఈ టెన్త్ బోర్డు పరీక్షలు!
Published Sat, Oct 22 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
Advertisement