అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి | terrorists came with automatic rifles in attack that lasted for 10 minutes | Sakshi
Sakshi News home page

అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి

Published Mon, Nov 28 2016 9:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి

అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి

మొత్తం పది మంది సాయుధులు.. అత్యాధునిక ఆయుధాలు.. పక్కా ప్లానింగ్.. జైలు లోపల ఖలిస్తాన్ చీఫ్ సహా ఐదుగురు ఉగ్రవాదులు. వాళ్లను తప్పించేందుకు చేసిన ఆపరేషన్ మొత్తం సరిగ్గా పదే నిమిషాల్లో ముగిసిపోయింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూను తప్పించేందుకు చేసిన ఈ ఆపరేషన్ కోసం వాళ్లంతా పోలీసు యూనిఫాంలు ధరించి వచ్చారు. పది ఉగ్రవాద కేసులలో నిందితుడైన కేఎల్ఎఫ్ చీఫ్‌ను పట్టుకోవడం అప్పట్లో పంజాబ్ పోలీసులకు పెద్ద విజయమే. అయితే.. పారిపోయిన మింటూను మళ్లీ పట్టుకోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఐదుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాడ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సాయుధులు పోలీసు దుస్తుల్లో ఉండి.. తనిఖీ కోసం ఓ ఖైదీని తీసుకొచ్చామని జైలు భద్రతా సిబ్బందికి చెప్పారు. చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ వ్యక్తిని తీసుకుని జైలు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. దాంతో వాళ్ల వాహనాలను జైల్లోకి అనుమతించారు. టయోటా ఫార్చూనర్ సహా రెండు వాహనాల్లో వచ్చిన ఆ ఉగ్రవాదులు.. నేరుగా లోపలకు వెళ్లిపో్యారు. ఉదయం 9 గంటల సమయంలో లోపలకు ప్రవేశించిన ఆ పదిమంది.. దాదాపు వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు.

తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో జైల్లో భీకర వాతావరణం సృష్టించి, తమకు కావల్సిన వాళ్లను పదే నిమిషాల్లో తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. జైలు భద్రతా సిబ్బంది వద్ద అంత ఆధునిక ఆయుధాలు లేకపోవడంతో వాళ్లను ఎదిరించడం సాధ్యం కాలేదు. జైలు సిబ్బంది వద్ద ఉన్న ఓ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను కూడా వాళ్లు తీసుకుపోయారు. జైల్లో ఉన్న ఖైదీలంతా టిఫిన్ చేయడానికి బ్యారక్స్ నుంచి బయటకు వచ్చే సమయం చూసుకుని సరిగ్గా అప్పుడే లోపలకు ప్రవేశించారు. ముందుగానే తమవాళ్లకు చెప్పి ఉంచడంతో.. వాళ్లు సులభంగా వీళ్ల వాహనాల్లోకి చేరుకున్నారు. కాల్పులు కొనసాగుతుండగానే ఖలిస్తాన్ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement