ఆ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీకి | That students to the government colleges | Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీకి

Published Sun, Jan 31 2016 3:47 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యం వేధింపులకు తట్టుకోలేక ముగ్గురు వైద్య విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య

విద్యార్థినుల ఆత్మహత్యతో జయ ఆదేశం

 చెన్నై: ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యం వేధింపులకు తట్టుకోలేక ముగ్గురు వైద్య విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో ఆ కళాశాలలో చదివే విద్యార్థులందరినీ ప్రభుత్వ కళాశాలకు తరలించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఆదేశించారు. కేసు విచారణను సీబీ సీఐడీకి అప్పగించారు. ఫీజు వేధింపులను తట్టుకోలేక తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో ఎస్‌వీఎస్ యోగా అండ్ నేచరోపతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

కళాశాల చైర్మన్ వాసుకీ సుబ్రమణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫీజు వేధింపులతో పాటు కాలేజీకి సంబంధించిన అనేక విషయాలు బయటపడుతున్నాయి. కాలేజీలో మౌ లిక సదుపాయాల కొరతతోపాటు కోర్సుల నిర్వహణకు సంబంధించి ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ అనుమతి లభించలేదని తేలింది. తమను ప్రభుత్వ కళాశాలకు బదిలీ చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకంటే అధికంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement