అందరికీ న్యాయమే రాజ్యాంగ అమలు లక్ష్యం
- రిజర్వేషన్లు స్వయంసమృద్ధికి తొలిమెట్లు మాత్రమే
- సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, అవకాశాలు కల్పిం చడమే రాజ్యాంగం అమలు లక్ష్యమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు పూర్తిస్థాయిలో అమలు జరిగితేనే సమాజంలో ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ’రాజ్యాంగం–లక్ష్యాలు’ అంశం పై వెనుకబడిన కులాల సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఎంపీ దేవేందర్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో స్వయం సమృద్ధి, సాధికారత సాధించేందుకు మాత్రమే రిజర్వేషన్లు తొలిమెట్లన్నారు. అంబేడ్కర్ రిజ ర్వేషన్లతో కాకుండా స్వయంకృషి, మేధస్సు తోనే ఎదిగారనేది గ్రహించాలని కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యల పరి ష్కారానికి ’ఈ పద్ధతే’ పరమావధి అన్న ఆలో చన సరైనది కాదని, వ్యవస్థకు అవసరమైన మార్పులు రాజ్యాంగపరంగా జరగాలన్నారు. విద్యాసంస్థల్లోని ప్రమాణాల మధ్య వ్యత్యాసం ఉండకూడదన్నారు. విద్యాప్రమాణాల్లో వ్యత్యాసం వల్ల నాణ్యమైన విద్యలేక ఇంజనీరింగ్ విద్యార్థులు అటెండర్ పోస్టులకు పోటీ పడుతున్నారని అన్నారు. సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ మాట్లాడుతూ.. వందల ఏళ్ల సమాజంలో నెలకొన్న సమస్యలను 70 ఏళ్ల రిజర్వేషన్లతో రూపుమాపలేమని అన్నారు.
రిజర్వేషన్లతోనే అన్నింటినీ పరిష్కరించలేం
సమాజంలో సమానత్వం తీసుకురా వడానికి నిరంతర కృషి అవసరమని, కేవ లం రిజర్వేషన్లతోనే అన్నింటినీ పరిష్కరిం చలేమని కేంద్ర సమాచార కమిషనర్ మా డభూషి శ్రీధర్ అన్నారు. సమాచార హ క్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను కూడా తీసుకురావాలని ఆయన అభిప్రా యపడ్డారు. ఈ సదస్సులో జేడీయూ నేత శరద్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి నాచియప్పన్, ఎంపీ రాపోలు ఆనందభా స్కర్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్.ఎన్.రావు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, జస్టిస్ వి. ఈశ్వరయ్య, మాజీ ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు.