పెన్షన్ చెల్లింపునకు కొత్త మార్గదర్శకాలు | The new guidelines for pension payout | Sakshi
Sakshi News home page

పెన్షన్ చెల్లింపునకు కొత్త మార్గదర్శకాలు

Published Thu, Jun 19 2014 3:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

The new guidelines for pension payout

న్యూఢిల్లీ: పెన్షన్ చెల్లింపులో ఆలస్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం రిటైర్డు ఉద్యోగి నేరుగా బ్యాంకుకు అండర్‌టేకింగ్ ఇస్తే వెంటనే ఆ ఉద్యోగి ఖాతాలో పెన్షన్ జమ అవుతుంది. ఇతర పెన్షన్ పత్రాలతో పాటు ఈ అండర్‌టేకింగ్ అందిన వెంటనే సదరు బ్యాంకు ఆ రిటైర్డు ఉద్యోగి ఖాతాలో డబ్బు జమచేస్తుందని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. ఈ అండర్‌టేకింగ్‌ను ఆయా ఆఫీసుల అత్యున్నత అధికారి నుంచి పొందవచ్చని, దానిని పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఇతర పత్రాలతో పాటు సంబంధిత బ్యాంకుకు సమర్పించాలంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement