న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి ప్రతిగా ప్రతి మూడు నెలలకోసారి పరిహారం చెల్లించాలని ముసాయిదా చట్టంలో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు శనివారం పరిహార నమూనా చట్టాన్ని విడుదల చేసింది. కాగ్ ఆడిట్ లెక్కల అనంతరం మాత్రమే వార్షిక రెవెన్యూ నష్టాన్ని నిర్ణరుుస్తారు. విలాస వస్తువులు, పొగాకు వంటి హాని చేసే ఉత్పత్తులపై ‘జీఎస్టీ పరిహార పన్ను’ రూపంలో రాష్ట్రాలకు పరిహారం కోసం ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఐదేళ్ల అనంతరం జీఎస్టీ పరిహార నిధిలో ఏమైనా మొత్తం ఉంటే దానిని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచుతారు. మిగులులో సగాన్ని కేంద్ర పన్ను ఆదాయానికి కలుపుతారు.
అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశిత నిష్పత్తిలో పంచుతారు. మిగతా 50 %... అంతకుముందు సంవత్సరం ఎస్జీఎస్టీ లెక్కల ప్రకారం రాష్ట్రాలకు పంచుతారు. పరిహారం కింద రాష్ట్రాలకు ఎక్కువ మొత్తం చెల్లించినట్లు గుర్తిస్తే తర్వాతి సంవత్సర పరిహారంలో సర్దుబాటు చేస్తారు. కేంద్రం శనివారం మోడల్ జీఎస్టీ, ఐజీఎస్టీ, పరిహార నమూనా చట్టాల్ని విడుదల చేసింది. అలాగే జీఎస్టీ అమలుతో వస్తువుల ధరలు పెరగకుండా చూసేందుకు పన్ను రేట్లు తగ్గించినప్పుడు వచ్చే లాభాల్ని వినియోగదారులకు వర్తక, వ్యాపార వర్గాలు చెల్లించేలా జీఎస్టీ చట్టంలో కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.
మూడు నెలలకోసారి రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ పరిహారం
Published Sun, Nov 27 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
Advertisement
Advertisement