ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్ | Traffic jam at NH 24 (Delhi) as Delhi Municipal workers continue with their protest over non payment of salary dues. | Sakshi
Sakshi News home page

ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్

Published Wed, Feb 3 2016 11:28 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్ - Sakshi

ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతన బకాయిలు చెల్లించాలన్న డిమాండ్ తో 8వ రోజూ ఉధృతంగా ఆందోళన జరుగుతోంది. బుధవారం రోడ్లమీదకు వచ్చిన మున్సిపల్ కార్మికులు పలుచోట్ల పాలకుల దిష్టబొమ్మలను దగ్ధం చేశారు. రాస్తారోకో నిర్వహించారు. నిర్మన్ విహార్ ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 24వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద ఎత్తున బారులు తీరిన వాహనాలతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.  

రాష్ట్ర ముఖ్యమంత్రి సహా, వివిధ శాఖల మంత్రుల ఇళ్లముందు చెత్తవేసి, నిరసన పత్రాలు అంటించి వినూత్నంగా  చేపట్టిన తమ పోరాటాన్ని పారిశుద్ధ్య కార్మికులు నేడు కూడా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెగేసి చెబుతున్నారు. అటు ఆప్ ప్రభుత్వం చెత్తను క్లీన్ చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి,  కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాగా ఈ వ్యవహారంలో ఆప్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement