న్యూఢిల్లీ: విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని యూజీసీ కోరింది. ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, స్ట్రాలు, బ్యాగ్‌లు, లంచ్ ప్యాకెట్ల వాడకంపై నిషేధం విధించాలని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను కోరింది. వాడిపారేసే వాటర్ బాటిళ్లకు బదులు పునర్వినియోగానికి వీలుండే బాటిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం కింద మున్సిపాలిటీలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వర్సిటీల వైస్ చాన్సలర్లను కోరింది. పాఠశాల విద్యార్థులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచ్‌లు, నదీ తీరాలు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ 19 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాలకు ఈ ఏడాది భారత్ వేదిక కానున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ సూచన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment