సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నియామకాలను నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. నియామకాల్లో యూనివర్సిటీ వారీగా ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్లు కాకుండా, విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలని గత ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నియామకాల్లో కోర్టు నిబంధనలు పాటించాలని యూజీసీ అప్పట్లో యూనివర్సిటీలకు లేఖలు రాసింది.
అయితే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేవరకు నియామకాలను ఏ దశలో ఉన్నా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు గురువారం యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఊర్మిళదేవి అన్ని రాష్ట్రాల, సెంట్రల్ యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment