దీని డిజైన్.. ఫ్యూచరిస్టిక్..
రైళ్లలో పెద్దగా సదుపాయాలేముంటాయ్.. ఉంటే.. గింటే.. ఏసీ వంటివి మాత్రమే ఉంటాయి అనుకునేవారికి ఝలక్ ఇచ్చే అల్ట్రా లగ్జరీ రైలు ఇదీ. ఒక విధంగా ఇది పట్టాలపై పరుగులు తీసే ఫైవ్ స్టార్ హోటల్‌లాంటిదన్నమాట. జపాన్ భవిష్యత్తు రైలుగా చెబుతున్న ఈ ’క్రూయిజ్ ట్రైన్’ను ఫెరారీ డిజైనర్ కెన్ ఒకుయామా.. జేఈ ఈస్ట్ రైల్వే కోసం డిజైన్ చేశారు.
2017లో పట్టాలెక్కే ఈ రైలులో మొత్తం 10 బోగీలుంటాయి. రైలు వెనుక భాగంలో రెండు అబ్జర్వేషన్ ప్రాంతాలుంటాయి. ఈ బోగీ అంతా అద్దాలతో తయారుచేసి ఉంటుంది. దీని వల్ల చుట్టు పక్కల ఉండే ప్రకృతి అందాలను చూస్తూ.. ప్రయాణికులు ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెండంతస్తుల రైలులో అత్యాధునిక సదుపాయాలుండే డీలక్స్ సూట్స్ కూడా ఉన్నాయి. ఐదు నక్షత్రాల హోటళ్లోని సదుపాయాలన్నీ ఇందులో అడుగడుగునా ఉం టాయి. ఇంకా డిన్నర్ ఏరియా వంటివి.. అదిరిపోయేలా ఉంటాయి. ఈ రైలు ధర. 307 కోట్లు..