
న్యూఢిల్లీ : ఎల్‌ఈడీ టీవీ, కొబ్బరి నీరు, బ్యాడ్మింటన్ రాకెట్‌తో పాటు జైళ్లో అనుమతి లేని మరేన్నో వస్తువులతో తీహార్ జైళ్లో ఇంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్. గృహ వినియోగదారులను మోసం చేయడమే కాక మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్రా తీహార్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే జైలు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వీరికి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ సహ ఖైదీ ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హై కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఇన్‌స్పెక్షన్ చేయాల్సిందిగా ఆదేశించారు. దాంతో జైలులో వీరికి కల్పించిన రాజభోగాల గురించి బయటకు వచ్చింది. అవినీతిపరులైన అధికారలు డబ్బుకు ఆశపడి నిబంధనలు ఉల్లంఘించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు.