ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు | UP girl asks friend to film rape by father | Sakshi
Sakshi News home page

ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు

Published Sun, Mar 20 2016 9:22 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు - Sakshi

ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు

జలావున్: కొన్ని అంశాలు బయటకు చెప్పేందుకు సిగ్గుగా అనిపించినా వాస్తవం కాబట్టి.. అది నిప్పులాంటిదయినందున చెప్పక తప్పదు. ఆమెకు పద్దెనిమేదేళ్లు. గత నాలుగేళ్లుగా కన్నతండ్రే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తన కన్నతల్లికి చెప్తే నమ్మడం లేదు. ఎన్నిసార్లు చెప్పిచూసిన ఆ తల్లి పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఆ అమ్మాయి ఎవరూ చేయకూడని సాహసాన్ని చేసింది. తన ఆత్మగౌరవాన్ని కాసేపు పక్కనపెట్టి స్నేహితుడితో ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు, తన తండ్రి తనపై అత్యాచారం చేసే సమయంలో వీడియో తీయమని, ఆ వీడియోను తన తల్లికి ప్రూఫ్గా చూపిస్తానని చెప్పింది.

ఉత్తరప్రదేశ్లోని జలావున్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తండ్రిలాంటివాడు ఉండకూడదని, పబ్లిక్ గా చంపేందుకు అర్హుడని చెప్పింది. 'అతడిని పలు శిక్షలతో బహిరంగంగా చంపేయాలి. అతడు మాములుగా చావాలని నేను కోరుకోను. ఎంతోబాధలకు గురై అతడు చావాలి. బహిరంగంగా ఉరితీయాలి. ప్రజలందరి చేతుల్లో చెప్పుదెబ్బలు తినేందుకు అర్హుడు. అప్పుటికైనా అతడికి తాను చేసిన నేరం తెలిసివస్తుందేమో' అని ఆ కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement