ఈ అనువాదం అదిరింది! | Viral News: Mistake In Translation Of Idli Dosa Batter | Sakshi
Sakshi News home page

ఇడ్లీ/ దోసపిండిలో కాలేశారు!

Published Thu, May 14 2020 10:01 AM | Last Updated on Thu, May 14 2020 10:06 AM

Viral News: Mistake In Translation Of Idli Dosa Batter - Sakshi

ఇడ్లీ/ దోస పిండి అనే అర్థానికి ఇడ్లీ/ దోస బల్లేబాజ్‌ అని ముద్రించిన దృశ్యం

న్యూఢిల్లీ : ఇంగ్లీషులో మనకు ఏదైనా అర్థంకాని పదాలు కానీ, వాక్యాలు కానీ ఉంటే వెంటనే గూగుల్‌ ట్రాన్స్‌లేషన్‌ సహాయం తీసుకుంటాం. కొన్ని కొన్ని పదాలకు సరైన సమాధానాలు చెప్పినా.. మరి కొన్నింటికి మాత్రం తనకు తెలిసిన సమాధానాలు మాత్రమే చెబుతుంది. దాన్నే పదపదాను వాదం అని అంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన అర్థాలు వచ్చే పదాలు, వాక్యాలు తయారవుతుంటాయి. ఇలాంటి ట్రాన్స్‌లేషన్‌ ఫేయిల్‌కు సంబంధించిన ఓ వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎంఎస్‌ అనే కంపెనీ తాజా ఇడ్లీ/ దోస పిండిని అమ్ముతుంది. ఇందుకు సంబంధించిన ప్యాకేజింగ్‌ కవర్‌పై  ఇడ్లీ/ దోస పిండి అని తెలిసే విధంగా మూడు భాషల్లో అక్షరాలను ముద్రించింది. ( మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..)

ఇంగ్లీష్‌, తమిళ్‌‌లోని పదాలు కరెక్ట్‌గానే ఉన్నా హిందీలోకి వచ్చేసరికి పిండిలో కాలేసింది కంపెనీ. ఇడ్లీ/ దోస బల్లేబాజ్‌ అని ముద్రించింది. ఇక్కడ బ్యాటర్‌కు సరిగ్గా సరిపోయే పదంగా బల్లేబాజ్‌ను వాడింది. బ్యాటర్‌ అంటే మామూలుగా బ్యాట్స్‌మ్యాన్‌ అని అర్థం వస్తుంది. అదేవిధంగా బల్లేబాజ్‌ అన్నా కూడా బ్యాట్స్‌మ్యాన్‌ అనే అర్థం వస్తుంది. అందుకే బ్యాటర్‌ను బల్లేబాజ్‌గా మార్చేసింది. దీంతో ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (వైరల్‌ : ఇప్పుడంతా మాదే రాజ్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement