మహారాష్ట్ర, హర్యానాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 15న ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మహారాష్ట్రలో 63.1 శాతం, హర్యానాలో76.5 శాతం పోలింగ్ నమోదైంది. అర్ధ గంటలోనే తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 10 గంటలకల్లా ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలిసిపోతుంది.
**