73 రిజర్వాయర్లలో తగ్గిన నీటి పరిమాణం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షించే 73 ప్రధాన రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే నీటి పరిమాణం తగ్గింది. అయితే ఉత్తర, మధ్య భారతంలోని మరో 18 రిజర్వాయర్లలో నీటి పరిమాణం పెరిగింది. జల వనరుల శాఖ వివరాల ప్రకారం జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, త్రిపురలోని 15 రిజర్వాయర్లలో సెప్టెంబర్ 3 నాటికి 10.98 బీసీఎం(బిలియన్ క్యూబిక్ మీటర్లు) నీరు ఉంది.
వాటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 58 శాతం. గుజరాత్, మహారాష్ట్రలో 27 ప్రధాన రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో 59 శాతం నీరు ఉంది. దక్షిణ భారతంలో 31 ప్రధాన రిజర్వాయర్లలోని మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో 33 శాతం మాత్రమే నీటి పరిమాణం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో నీటి నిల్వ గతేడాది ఇదే సమయానికి 75 శాతం నీరు ఉంది.