వివరాలు సేకరిస్తున్నాం.. రాజ్నాథ్
న్యూఢిల్లీ : దేశంలో భూప్రకంపనలపై సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం ఉత్తర, ఈశాన్య భారతాన్ని మరోసారి భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూప్రకంపనలపై ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశంలో ఎక్కడ నష్టం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కాగా ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. నోయిడాలోని పలు షాపింగ్ మాల్స్ నుంచి జనం పరుగులు తీసినట్టు సమాచారం.