వారంలో సీఎం పదవికి రాజీనామా: గొగోయ్ | Week to the resignation of Chief: Gogoi | Sakshi
Sakshi News home page

వారంలో సీఎం పదవికి రాజీనామా: గొగోయ్

Published Sun, May 18 2014 1:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Week to the resignation of Chief: Gogoi

గువాహటి: తనలో, కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన ఒకింత అహంకార, ఉదాశీన వైఖరి వల్లే రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో తమకు పేలవ ఫలితాలు వచ్చాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తెలిపారు. మొత్తం 14 ఎంపీ సీట్లకుగానూ 3 సీట్లలోనే తాము గెలిచామని...ఇందుకు నైతిక బాధ్యత వహించి వారం రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని శనివారం గువాహటిలో చెప్పారు.

కానీ రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోనని...పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ‘‘మూడుసార్లు సీఎంగా గెలిచాక ఎవరిలోనైనా ఎంతో కొంత అహంకారం, ఉదాశీన వైఖరి వచ్చి చేరతాయి. నాలో, పార్టీలోనూ ఇదే కనిపించింది. మమ్మల్ని ఎవరూ ఓడించలేరనుకున్నాం. ప్రజా వ్యతిరేకతను గుర్తించలేకపోయాం’’ అని గోగోయ్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement