'ఆయనను గుజరాత్‌ ఎందుకు తీసుకెళ్లారు?' | Why Is PM Abe Being Hosted In Gujarat, Not Delhi, Asks Congress | Sakshi
Sakshi News home page

'ఆయనను గుజరాత్‌ ఎందుకు తీసుకెళ్లారు?'

Published Thu, Sep 14 2017 10:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'ఆయనను గుజరాత్‌ ఎందుకు తీసుకెళ్లారు?' - Sakshi

'ఆయనను గుజరాత్‌ ఎందుకు తీసుకెళ్లారు?'

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జపాన్‌ ప్రధాని షింజో అబేను ఎందుకు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురాకుండా గుజరాత్‌కు తీసుకెళ్లారని నిలదీసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని ఈ పనిచేశారంటూ దుయ్యబట్టింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ అబేకు అహ్మదాబాద్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై స్పందిస్తూ అబేకు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వకుంటే అది ఆచరణ శూన్యమే అవుతుందని అన్నారు.

దేశ పర్యటనకు వచ్చే విదేశాల అధిపతుల అంశాలను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోకూడదని, అలా చేస్తే ప్రయోజన శూన్యం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలో ఆతిథ్యం ఏర్పాటుచేయకపోవడం అర్థరాహిత్యం అవుతుందని చెప్పారు. భారత్‌కు జపాన్‌తో గొప్ప సంబంధం ఉందని, ఆ బంధం, ఇరు దేశాలమధ్య వ్యవస్థాపనలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement