న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చర్యల్లో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కమెండోలు మరింతగా పాలుపంచుకునే దిశగా.. 600 మంది కమాండోలను వీవీఐపీల భద్రత యూనిట్ నుంచి ఎన్‌ఎస్‌జీ తప్పించింది. ప్రముఖులకు భద్రత నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌జీ కమాండోల్ని వెనక్కు రప్పించాలని రెండేళ్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీ సిబ్బందిని ఇకమీదట కచ్చితంగా ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కొనేందుకే వినియోగించాలన్న భావనకు వచ్చారు.
తాజాగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం 11వ ప్రత్యేక రేంజర్స్ గ్రూప్(ఎస్‌ఆర్‌జీ)లోని మూడు బృందాల్లో రెండింటిని వీవీఐపీ భద్రత కార్యకలాపాల నుంచి ఉపసంహరించాలని భావిస్తున్నారు. వీరిని స్పెషల్ యాక్షన్ గ్రూప్(ఎస్‌ఏజీ)తో కలసి ఉగ్రవాద మూకలపై పోరాడేందుకు సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండో బృందాలు ప్రస్తుతం ఐదు ప్రాథమిక యూనిట్లుగా ఉంది.
వీవీఐపీ భద్రత నుంచి కమాండోల ఉపసంహరణ
Published Mon, Feb 15 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement