'అవును ఇది నా ప్రయివేట్ పార్టీనే'
న్యూఢిల్లీ : ప్రపంచమే తన కుటుంబమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అన్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ అందరూ నవ్వుతూ బతకాలని, సమాజానికి ఎంత ప్రేమ పంచితే... ఆ ప్రేమ మీలో వంద రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. వివిధ మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాలని శ్రీశ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు.
'ఇది నా ప్రయివేటు పార్టీ అని కొందరు ఆరోపణలు చేశారు.. అవును ఇది నా ప్రైవేట్ పార్టీనే.. ప్రపంచమే నా కుటుంబం' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రజలను ఐక్యం చేసేందుకు ఐదు మధ్యమాలు ఉన్నాయన్న శ్రీశ్రీ రవిశంకర్, వివిధ, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాల్సిన అవసరం ఉందనన్నారు. మంచి పని చేసేటప్పుడు కొన్ని విఘ్నాలు కలగడం సహజమేనని, అయితే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొనడం ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చిందన్నారు.