అగ్గిపెట్టెతో విమానాన్ని హైజాక్ చెయ్యొచ్చా!
వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టులలో తనిఖీలపై కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయాణ సమయంలో అగ్గిపెట్టెను వెంటే ఉంచుకుంటానని, మంత్రిని కాబట్టి నన్నెవరూ తనిఖీ చేయరని చెప్పారు.

'నేను చైన్ స్మోకర్ని కాబట్టి అగ్గిపెట్టో, లైటరో ఎప్పుడూ వెంటే ఉంటుంది. విమానం ఎక్కేటప్పుడు కూడా! అయినా.. అగ్గిపెట్టెతో ఎవరైనా ఫ్లైట్ని హైజాక్ చెయ్యొచ్చా! ప్రపంచంలో అలాంటి సంఘట ఎప్పుడైనా జరిగిందా? అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన కామెట్లకు అవాక్కయిన విలేకరులు.. 'విమానయాన మంత్రి అయిఉండీ ఇలా మాట్లాడటం సబబేనా?' అని ప్రశ్నించగా, నేనన్నదాంట్లో తప్పేముంది? అని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.