చట్ట సభల ప్రతిష్టంభన ఇంకెంతకాలం?
అవలోకనం
సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నంత కాలం, బీజేపీ ఊరికే చూస్తుండిపోగలదు. మన ప్రజానీకం ఘటనలను ఉదాసీనంగా అలా తిలకిస్తున్నంత కాలం, మీడియా కేవలం అంచనాలమీదే ఆసక్తి చూపుతున్నంత కాలం ప్రభుత్వ శాసన ఎజెండాలో జాప్యం జరుగుతూంటుంది.
వెబ్ మినిస్టర్ ప్యాలెస్‌ను నిర్వహించే అధికారిక ఇన్‌చార్జిని బ్లాక్ రాడ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్యాలెస్‌లో బ్రిటన్ పార్లమెంట్ సమావేశమ వుతుంది. ఈ అధికారిక పదవిని 14వ శతాబ్దం నుంచి కొనసాగిస్తున్నారు. ఇది వారి పార్లమెంటరీ వ్యవస్థ సంప్రదాయాన్ని, ప్రొటోకాల్ కొన సాగింపును ప్రతిబింబిస్తుంది. హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రతినిధుల సభ)కు వెళ్లి దాని సభ్యులకు బ్రిటన్ రాణి వార్షిక ప్రసంగానికి రావలసిందిగా సమన్లు పంపడం ఈ బ్లాక్ రాడ్ పనుల్లో ఒకటి.
ప్రతినిధుల సభలో అతడు కాస్త వంగి ఇలా చెబుతాడు: ‘మిస్టర్ స్పీకర్, హౌస్ ఆఫ్ పీర్స్‌లో తక్షణం హర్ మెజెస్టీని కలవవలసిందిగా గౌరవనీయ సభను రాణి ఆదేశిస్తున్నారు.’ ఈ హౌస్ ఆఫ్ పీర్స్‌నే హౌస్ ఆఫ్ లార్డ్స్ అని కూడా అంటారు. ఇది కులీనుల సభ.
అనేక సంవత్సరాలుగా బ్లాక్ రాడ్ చెప్పే ఈ లఘు పంక్తిని లేబర్ పార్టీ ఎంపీ డెన్నిస్ స్కిన్నర్ మొరటు వ్యాఖ్య ఒకటి వెన్నంటి వచ్చేది. డెన్నిస్ మాజీ కోల్ మైనర్, రిపబ్లికన్ కూడా. అంటే అతడు రాజరికాన్ని వ్యతిరేకి స్తాడని అర్థం. రాజరిక వ్యవహారాల్లో అతడి జోక్యం క్లుప్తంగా ఉండేది. అం టే సాధారణంగా ఒక పంక్తితో ముగిసేది కానీ హాస్యస్ఫోరకంగా ఉండేది. ఎందుకంటే హుందాతోకూడిన, లాంఛనప్రాయమైన కార్యక్రమాన్ని ఈ వ్యాఖ్య విచ్ఛిన్నపరిచేది. ఇతడి గురించి పెద్దగా తెలియని పాఠకులకు ఇంటర్నెట్‌లో డెన్నిస్ స్కిన్నర్ అనే పదాన్ని సెర్చ్ చేయడం ప్రయోజనకరంగానే ఉంటుంది.
భారత పార్లమెంటులో ప్రస్తుతం సభకు అంతరాయం కలిగిస్తుండటంపై శుక్రవారం నేను ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఈ డెన్నిస్ స్కిన్నర్‌ను తలుచుకున్నాను.అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొల గించడం లేదా కనీసం వారిపై తగు చర్యలు తీసుకునేంతవరకు తాను పార్లమెంట్ కార్యక్రమాలను అనుమతించబోనని కాంగ్రెస్ దృఢ వైఖరితో ఉంది. అవినీతి మకిలి అంటుకున్న నేతల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా ఉన్నారు. పరారీలో ఉన్న, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి నిగూఢంగా సాయపడ్డారని వీరిరు వురిపై ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై చర్యకు నరేంద్రమోదీ తిరస్కరించడం, ఆమోదం తెలుపక పోవడంతో కాంగ్రెస్‌కు ఒక మంచి అవకాశం వచ్చింది. అయితే ఇందులో తప్పక ప్రశ్నించవలసింది ఒకటుంది. కాంగ్రెస్ ప్రస్తుతం చేస్తున్నది చట్టసమ్మతమైం దేనా? బహుశా కాకపోవచ్చు. పార్లమెంటు ఉన్నది శాసనాల రూపకల్పన, చర్చ కోసమే. ప్రభుత్వానికి తన సత్తా ఏమిటో చూపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లయితే దానికి లోక్‌సభే తగిన వేదిక. ఈ సందర్భంగా పైప్రశ్న మరొక ప్రశ్నకు తావి స్తోంది. కాంగ్రెస్ మంచి రాజకీయాలనే ప్రదర్శిస్తోందా?
దీనికి సమాధానం ఉంది. అవును. రాహుల్ గాంధీ వంటి పేలవమైన వక్త లున్న పార్టీకి పార్లమెంటును స్తంభింపచేయడం ద్వారా గుర్తింపు వస్తుంది. కాం గ్రెస్ పార్టీ చర్చల్లో ప్రకాశించేటట్టు కనిపించడం లేదు. మేధోపరమైన భావ ప్రసా రం కోసం వినడాన్ని ఆస్వాదించే దేశం మనది అని మనం భావిస్తున్నట్లయితే, మనం అలా ఉండటం లేదు. సంఖ్యల విషయానికి వస్తే, 44 మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ, ట్రెజరీ బెంచ్‌లపై ఆధిపత్యం చలాయించేంత బలమైన ది కాదు. ఎలాంటి ఆటంకమూ లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో అసంగతమైనదిగా మారిపోతుంది.
పార్లమెంటులో కార్యక్రమాలను ఎంత కాలం నిలువరిస్తే, అంతగా కాంగ్రెస్ తాత్కాలికంగా అయినా గుర్తింపు పొందుతుంది. ప్రతిష్టంభన అనేది ఒక ఎత్తుగడ మాత్రమే. దాన్ని ఒక వ్యూహం స్థాయికి మార్చాలన్నా లేదా వ్యూహంలో భాగంగా ఉంచాలన్నా దానికి కొంత యోచన అవసరం. అయితే ఆ పార్టీలో అలాంటిది జరుగుతున్నట్లు నాకనిపించడం లేదు.
ఏదేమైనా, అలాంటి ఎత్తుగడలలో కాంగ్రెస్‌కి సహాయపడే అంశం ఏదైనా ఉందంటే మన మీడియాలో, సాధారణ ప్రజానీకంలో.. సభకు అంతరా యం కలిగించడం పట్ల ఉండే సహనభావమే. పార్లమెంట్ హౌస్‌కి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ పేర్కొన్న ప్రజాస్వామ్య దేవాలయం అనే భావం విషయంలో అంత భయానకమైనదేమీ లేదు.
‘మా డిమాండ్లను నెరవేర్చు లేదా మేం ఏ పనికీ అనుమతించం’ అనే తరహా విచ్ఛిన్న వైఖరి యునెటైడ్ కింగ్‌డమ్ పార్లమెంటులో లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాల చట్టసభల్లో కాని ఊహించడానికైనా సాధ్యం కాదు.మరి ప్రభుత్వ వైఖరి ఏమిటి? అత్యవసరంగా చట్టరూపం ఇవ్వాల్సిన బిల్లులు దానిముందు చాలానే ఉన్నాయి. సంస్కరణలమందగమనంపై కార్పొరేట్ వర్గాల్లో నెలకొంటున్న చికాకు మోదీని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంలో తప్పు చేస్తున్నదని భావిస్తున్నాను. సెషన్ ప్రారంభం కాకముందే దీన్ని ఎదుర్కోవడానికి తాను ఏదో ఒకటి చేయవలసి ఉందని ప్రభుత్వానికి తెలుసు. కాని అదేమీ చేయలేదు. ఎందుకు? తాను కాంగ్రెస్‌ను సునాయాసంగా తిప్పికొట్టగల నని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అదే నిజమైతే దాని వైఖరి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ సభలో అలిసిపోతుందని, ఈ విషయంపై పోరాడి పోరాడి మరో విషయంపై చర్చను చేపడుతుందని ప్రభుత్వం భావించిందంటేనే సబబుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. పార్లమెంటుకు అంతరాయం కలిగించేంతగా ప్రతిపక్షానికి చికాకు కలిగించిన ఘటనల జాబితాను చూడడానికి గతించిన కాలాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పక్షాలకు వేడి పుట్టించేలా కనిపించిన అనేక అంశాలు కొద్ది రోజుల్లోనే చల్లబడి పోవడం కూడా జరిగింది. ఆగస్టు మధ్య వరకు వర్షాకాల సెషన్ కొనసాగితే ఇప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు.
కాని ఇది జూదమే. ఇలాంటిది కాంగ్రెస్‌కు చొరవ తీసుకునే అవకాశాన్ని అందిస్తుంది కూడా. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నంత కాలం, బీజేపీ ఊరికే చూస్తుండిపోగలదు. ఒక ఉదాసీన జాతి ఊరకే అలా తిలకిస్తున్నంత కాలం, మీడియా కేవలం అంచనాల మీదే ఆసక్తి చూపుతున్నంత కాలం ప్రభుత్వ శాసన ఎజెండాలో జాప్యం జరు గుతూ ఉంటుంది. పార్లమెంటు నిరంతర ప్రతిష్టంభనలో నా అభిప్రాయం ఏమిటంటే... అది మన సంప్రదాయం, ప్రొటోకాల్ రూపం. మనదీ డెన్నిస్ స్కిన్నర్‌ల జాతే మరి.
ఆకార్ పటేల్
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com