సోదరప్రేమ | brothers love of Ram, Laxman | Sakshi
Sakshi News home page

సోదరప్రేమ

Published Sat, Feb 20 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

సోదరప్రేమ

సోదరప్రేమ

రామ, లక్ష్మణ, భరత ,శత్రుఘు్నల సోదరప్రేమ చిరస్మ రణీయమైనది, ఆదర్శప్రాయమైనట్టిది. వనవాసానికి బయలుదేరుతున్న శ్రీరామచంద్రునితో, నన్ను కూడా అడవికి తీసుకువెళ్లమని లక్ష్మణుడు ప్రాధేయపడ్డాడు. ‘నీవు దగ్గరలేనప్పుడు నాకు ఐశ్వర్యం లభించినా, స్వర్గాది లోకవాసం సిద్ధించినా నేను దానిని అంగీ కరించను. అరణ్యవాసానికి వెళ్లే నీకు నేను దారి చూపిస్తూ ముందు నడుస్తాను. కంద మూల ఫలాలను నీకు అడవిలో సమకూరుస్తాను. నీకు సీతాదేవికి పగలు, రాత్రి అవసరమయ్యే సేవలను నేను సమకూరు స్తాను’ అని లక్ష్మణుడు శ్రీరామునితో పేర్కొన్నాడు.

 తన ప్రయత్నం లేకుండానే తన చేతికి అందివ చ్చిన రాజ్యాన్ని అనుభవించాల్సిన భరతుడు తనకీ రాజ్య సుఖాలు, పరిపాలనాధికారం వద్దన్నాడు. నిండు సభలో అందరి ముందు ఏడ్చాడు. ఈ రాజ్యం అన్నకే చెందాలన్నాడు. రాజ్యం కన్న తనకు అన్నయే ముఖ్యమని పేర్కొన్నాడు. శ్రీరామ దర్శనం, ఆయన పాదస్పర్శ వల్లనే తన మనస్సుకు ప్రశాంతత కలుగు తుందని తెలిపాడు.

 శ్రీరామచంద్రునికి కూడా తమ్ముళ్లంటే గొప్ప ఆదరభావం ఉంది. అందుకే లక్ష్మణుణ్ని తనకు బహిః ప్రాణంగా పేర్కొన్నాడు. తనకు తండ్రిలేని లోటు తెలియకుండా ప్రక్కనే ఉంటూ కంటి రెప్పలాగా రక్షిస్తూ, తండ్రిని మరిపిస్తున్నాడని లక్ష్మణుణ్ని గూర్చి ప్రశంసాపూర్వకంగా శ్రీరాముడు చెప్పాడు.

 లోకంలో ఎందరెందరో సోదరులుంటారు. కాని ఎవరికి కూడా భరతుని లాంటి సోదరుడు లభించడు అని ప్రకటించాడు. లక్ష్మణుడు తన పరిచయాన్ని హనుమంతునికి వివరిస్తూ- నేను బంధుత్వాన్ని బట్టి శ్రీరామచంద్రునికి తమ్ముడను. కాని ఆయనలోని గుణాలకు నేను పారవశ్యం చెంది దాసుడనయ్యాను అని పేర్కొన్నాడు. యుద్ధభూమిలో మూర్ఛనొందిన లక్ష్మణుణ్ని చూసిన శ్రీరాముడు, ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ బంధుమిత్రులను, తగిన భార్యను పొందగలమేమో కాని లక్ష్మణునివంటి తోబుట్టువును సంపాదించ లేమని వాపోయాడు.

 భరతుణ్ని వదలి క్షణం కూడా ఉండలేని శత్రుఘు్నడు భరతునితో కలసి అతని మేనమామ ఇంటికి సంతోషంగా వెళ్లాడు. భరతుని సేవలో నిమగ్నుడై జీవనయానాన్ని కొనసాగించిన శత్రు ఘు్నడు అరిషడ్వర్గాన్ని జయించిన మహనీయుడు.

 ఈ నలుగురి సోదర ప్రేమను మనం ఆదర్శంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం.

 

 -సముద్రాల శఠగోపాచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement