రాష్ట్రంలో గత ఏడాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువత స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రాయితీ పొందేందుకు అనుమతులు కూడా వచ్చాయి. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ రావటం, సార్వత్రిక ఎన్నికలు జరగటంతో కార్పొరేషన్ నుంచి వచ్చే స్వయం ఉపాధి రాయితీలు ఆగిపోయాయి. ఏడాది దాటింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే ఏదైనా స్వయం సహాయక సంస్థ ద్వారా ఉపాధి పొందొచ్చని, ఆర్థికంగా కొంత మెరుగుపడగలమని లబ్ధిదారులు ఎంతోమంది రుణాల కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్టంలో తమ బతుకులు మారతాయని వెనుకబడిన వర్గాల యువత ఎంతో ఆసక్తితో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 2013-14 సంవత్సరంలో ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి షరతులు లేకుండా స్వయం సహాయక రుణాలు అందివ్వాలి. అలాగే వయసు ప్రతిపాదనతో ఉన్న జీవో 101ను తొలగించాలి. మాట తప్పని నేత కేసీఆర్ వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గత ఏడాది మంజూరు చేసిన రుణాలు వెంటనే ఇప్పించాలి. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్తగా స్వయంసహాయక రుణాలను మంజూరు చేయాలని మనవి.
బుర్రి శేఖర్ ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా
ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి రుణాలు
Published Fri, Jan 2 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement