
పన్ను వివరాలు రహస్యమా?
సమాచార చట్టం ప్రకారం ఒక వ్యక్తి సమాచారాన్ని వెల్లడించాలని అడిగిన ప్పుడు, ప్రైవసీ కింద మినహారుుంపు నియమాన్ని అడ్డుగోడగా చూపుతూ సమాచార అభ్యర్థనను తిరస్కరించడం చట్టం అంగీకరించదు.
విశ్లేషణ
సమాచార చట్టం ప్రకారం ఒక వ్యక్తి సమాచారాన్ని వెల్లడించాలని అడిగిన ప్పుడు, ప్రైవసీ కింద మినహారుుంపు నియమాన్ని అడ్డుగోడగా చూపుతూ సమాచార అభ్యర్థనను తిరస్కరించడం చట్టం అంగీకరించదు.
20 మంది ఎంపీల ఆదాయ సమాచారాన్ని ఇవ్వాలని ఏడీ ఆర్ ప్రజాసంస్థ ప్రతినిధి అనిల్ బర్వాల్ కోరారు. నవీన్‌జిందాల్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, నవ్ జ్యోత్‌సింగ్ సిద్దూ, బేనీ ప్రసాద్ వర్మ, అజిత్‌సింగ్, లాలూప్రసాద్ యాదవ్, టీఆర్ బాలు, మేనకా గాంధీ, ఉషావర్మ, షెల్జా తదితర ఎంపీలు 2004 నుంచి 2009 వరకు ఆదాయపన్ను వివ రాలు దాఖలు చేశారా? అని బర్వాల్ ప్రశ్నిస్తూ ఐటీ రిటర్న్, పన్ను మదింపు ఉత్తర్వుల కాపీలు కావాలని కోరారు. సొంత సమాచారమని, సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వడానికి వీల్లేదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చూపి అధికారులు తిరస్కరించారు.
రిటర్న్ కాపీలు అడగరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న మాట నిజమే. కాని ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారా లేదా, ఏ సంవత్సరాలకు వారు ఐటీ ఆర్‌లు ఇవ్వలేదు అన్న సమాచారమైనా ఇవ్వవచ్చు కదా? మొత్తం ప్రశ్నలన్నీ తిరస్కరించడం సమంజ సమా? సొంత సమాచారమైనా విస్తృత ప్రజా ప్రయో జనాలు ఉన్నాయనుకుంటే వెల్లడి చేయవచ్చని ఆ సెక్షన్‌లోనే మినహారుుంపు ఉంది. సెక్షన్ 10 ప్రకారం అడిగిన సమాచారంలో ఇవ్వవలసిన దాన్ని, ఇవ్వడా నికి వీల్లేని సమాచారం నుంచి వేరు చేసి ఇవ్వవచ్చని ఉంది. కనీసం ఆ ప్రయత్నమైనా చేయరా? అసలు పీఐఓగారు ప్రజాప్రయోజనం అంశాన్ని పరిశీలిం చారా లేదా? ఎంపీలుగా ఎన్నికైన తరువాత ఏటేటా లోక్‌సభ సభాపతికి రాజ్యసభ అధ్యక్షుడికి ఆస్తిపాస్తుల వివరాలు సమర్పించాలి. ప్రజా ప్రాతినిధ్యచట్టం 1951 కింద చేసిన నియమాల్లో ఈ నిర్దేశాలున్నాయి. సభ్య త్వం స్వీకరించిన 90 రోజుల్లో ఆస్తిపాస్తుల వివరాల ప్రకటన చేయాలి. ప్రతి సంవత్సరం రాజ్యసభ ఎంపీ లు తాజా వివరాలు ఇవ్వాలని నియమాలున్నాయి. ఈ పత్రాలు రహస్యాలు కాదు, అడిగి తెలుసుకోవచ్చు.
మరొకరి సొంత సమాచారం అని అనుకున్నా ఆ మరొకరిని సంప్రదించాలని, వారు కాదంటే ప్రజా ప్రయోజనం ఏదైనా ఉందనుకుంటే పీఐఓ ఇవ్వవచ్చని సెక్షన్ 11(1)లో మినహారుుంపు ఉన్నా, అధికారులు తిరస్కరించడం పరిపాటిగా మారిపోయింది. ఎంపీ లకు వేరే లాభసాటి ఆదాయ పదవి, హోదా ఉండకూ డదు. 8(1)(జె) కింద మూడు షరతులున్నారుు. అడి గిన సమాచారం ప్రజలతోగానీ వారి ప్రయోజనాలతో గానీ సంబంధంలేని అంశమైతే, వెల్లడిస్తే అన్యా యంగా వారి ప్రైవసీ భంగపడితే, విస్తృత ప్రయోజనం లేకపోతే, ఆ సమాచారం ఇవ్వనవసరం లేదు. అంటే ప్రజలతో సంబంధం ఉంటే, ప్రైవసీకి భంగం కలిగినా సరే.. ప్రజా ప్రయోజనం ఉంటే అడిగిన సమాచారం సొంత సమాచారమైనా ఇవ్వవచ్చని చాలా స్పష్టంగా ఉంది. విస్తారమైన ప్రజాప్రయోజనం ఏదైనా ఉంటే సొంత విషయాల వివరాలు ఇవ్వడం న్యాయమే.
సెక్షన్ 138(1)(బి) ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రజాప్రయోజనం ఆధారంగా ఆదాయ పన్ను రిటర్న్ సమాచారం ఇవ్వాలో లేదో పరిశీలించే బాధ్యత అధికారులపైన ఉంది. అనుమేహ కేసులో ప్రధాన సమాచార కమిషనర్ ఏఎన్ తివారీ 2008లో ఇచ్చిన ఒక తీర్పులో ఆదాయపు పన్ను చట్టంలోనే సమాచారం వెల్లడి చేయాలనే నియమం ఉందని గుర్తు చేశారు. జీఆర్ రావల్ వర్సెస్ డెరైక్టర్ జనరల్ ఇన్‌కంటాక్స్ అహ్మదాబాద్ (2008) కేసులో ముగ్గురు సభ్యుల బెంచ్ విస్తారమైన ప్రజా ప్రయోజనాలు ఉంటే ప్రైవసీపై దాడిని పట్టించుకోనవసరం లేదని వివరించింది. సమాచారానికి సంబంధించిన పరిస్థితులను పరిశీ లించి ఆ సందర్భాన్ని బట్టి ప్రజా ప్రయోజనాన్ని పరిశీ లించవలసి ఉంటుంది.
ప్రజారంగంలో కీలకమైన హోదాలో ఉన్న అంశం, పబ్లిక్ ఆఫీసుకు సంబంధించి నంతవరకు ఆయన ఆదాయాలు, బాకీలతోపాటు, ఆయన కుటుంబంలో సన్నిహిత సభ్యుల ఆదాయాలు, ఆస్తులు కూడా సొంతమవుతాయా కావా అనే అంశాలు విచారించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ శాఖ అధికారి, సమాచార చట్టం ప్రకారం పీఐఓ ఒక వ్యక్తి సమాచారాన్ని వెల్లడించాలని అడిగినప్పుడు ప్రజా ప్రయోజన అంశాలను సమగ్రంగా విచారించిన తరువాతనే సమాచారం ఇవ్వాలో వద్దో తేల్చు కోవా లని రెండు చట్టాలు నిర్దేశిస్తు న్నప్పుడు మినహాయింపు నియమాన్ని అడ్డుగోడగా చూపుతూ అడ్డగోలుగా సమాచార అభ్యర్థనను టోకున తిరస్కరించడం చట్టం అంగీకరించదు. రాజకీయ పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఇవ్వాల్సిందే అని సమాచార కమిషన్ ఇది వరకే నిర్ధారించింది.
ఎంపీలు ప్రజల ఓట్లతో ఎన్నికై, ప్రజలకోసం వారి ప్రతినిధులుగా పనిచేయవలసి ఉండగా, వారికి తగినంత నెలజీత భత్యాలు ప్రభుత్వమే ఇస్తున్న ప్పుడు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా ఉచి తంగా కల్పిస్తున్నపుడు వారి ఆదాయ వివరాలు రహ స్యంగా దాచడం సమంజసమా? ఈ అంశాలను పరి శీలించాలని 8 కేసులను తిరిగి సమాచార అధికారులకు పంపాలని ిసీఐసీ ఆదేశించింది. అనిల్ బర్వాల్ వర్సెస్ ఆదాయపు పన్ను కమిషనర్ ఇఐఇ/ఈ/అ/20 11/004 218, కేసులో 10.8.2016 న శ్రీ బసంత్ సేథ్, శ్రీధరా చార్యులు ఇచ్చిన తీర్పు ఆధారంగా.
మాడభూషి శ్రీధర్,
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com