తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు అమలు తీరు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు అమలు తీరు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల చేతిలో వజ్రా యుధమైన సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి సుమారు పది సంవత్సరాలు కావస్తున్నా, ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులకు నేటివరకు సరైన అవగాహన లేకపోవడం గమనార్హం. పాలనలో పారదర్శకత, జవాబు దారీతనం పెంపు, అవినీతి నిర్మూలనకు దోహదపడే స.హ. చట్టంను పాలకులు, అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఎలాంటి బోర్డులు కానరావడం లేదు.
వివిధ సమస్యలపై వివిధ కార్యాలయాలకు దరఖాస్తు చేసినా నెల రోజుల గడువులోపు సమాచారం రాకపోవడం, దరఖాస్తు దారులలో ఆందోళనను పెంచడం సర్వసాధారణం అయి పోయింది. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ద్వితీ య అప్పీళ్లు కూడా పెండింగులో ఉండటం, రాష్ట్రాలు వేరు పడినా ఉమ్మడిగానే కమిషన్ ఉండటం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందిం చి సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమ లు జరిగేలా చూడాలి.
కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్