రాయలసీమ జిల్లాల ముఖద్వారం, రాష్ట్ర పూర్వ రాజధాని కర్నూలు జిల్లా.
రాయలసీమ జిల్లాల ముఖద్వారం, రాష్ట్ర పూర్వ రాజధాని కర్నూ లు జిల్లా. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఏఐసీసీ అధ్యక్షు లను దేశానికి అందించిన జిల్లాగా పేరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతమిది. ప్రత్యేకించి కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతానికి సాగు నీరు, తాగునీరు, ఉపాధి, అభివృద్ధి వంటివి పూర్తిగా అందని ద్రాక్ష గానే ఉంటున్నాయి. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు నియోజకవర్గాలతో ఉన్న ప్రాంతం అనాదిగా పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలస త్వం, అవినీతితో అభివృద్ధికి ఆమడదూరంలా నిలిచిపోయింది.
వరుస కరువులు, గ్రామాల్లో ఉపాధి కనుమరుగవడంతో బతుకుతెరువు కోసం, పిల్లాపాపలు, తట్టాబుట్టతో సుదూర ప్రాంతాలకు పొట్టచేత బట్టుకుని వలసవెళ్లడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ. తాగునీరును ఇప్పటికీ కిలోమీటర్ల మేర నడిచి తెచ్చు కోవడం, రాని తాగునీటి కుళాయిల కోసం రోజుల తరబడి వే చి చూడటం 300 అడుగుల లోతున బేర్లు వేసినా గంగమ్మ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో హగరి (వేదావతి), తుంగ భద్ర, హంద్రీ వంటి నదులు ప్రవహిస్తూ, ఏటా వర్షాకాలంలో వం దల టీఎంసీల నీరు వృథాగా కిందికి వెళుతున్నా పట్టించుకునే నాథులు లేరు. హంద్రీనీవా సుజలస్రవంతి, గురురాఘవేంద్ర, తుంగభద్ర వరద కాలువ, గుండ్రేవుల రిజర్వాయరు వంటి ప్రభు త్వం ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టులు ఏళ్లు గడిచినా పూర్తికాక రైతాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాలో మూడు రిజర్వాయర్లు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యం పెట్టుకున్నారు. పత్తి కొండ నియోజకవర్గంలో పందికోన రిజర్వాయర్ ద్వారా 42 వేల ఎకరాలు, క్రిష్ణగిరి రిజర్వాయర్ ద్వారా 5,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చు.
కానీ 2005లోనే ప్రారంభించనప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం నిధుల కేటాయింపులు, నిధుల విడుదలపై మీనమేషాలు లెక్కిస్తూ పంట కాలువల నిర్మాణం పూర్తి చేయకుండా ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. పాలకులకు చిత్తశుద్ధి లోపించడంతో కళ్ల ముందు నీళ్లు పరుగెడుతుంటే, దీనంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తే పరిస్థితి నెలకొంది. 2006లో జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ నేతృత్వంలో సీపీఎం 1500 కిలోమీ టర్ల పాదయాత్ర ద్వారా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. దీని కొన సాగింపుగా నేటికీ జిల్లాలో పాదయాత్రలు, సదస్సులు, కార్యాల యాల ముట్టడి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. లక్ష లాది రైతాంగాన్ని కరువు బారినుంచి కాపాడే ఈ ప్రాజెక్టుల సాధనకు ప్రజాప్రతినిధులు చొరవచూపి పరిష్కరించాలి.
- వీరశేఖర్ సీపీఎం డివిజన్ కార్యదర్శి, పత్తికొండ