‘అయినప్పటికీ’ ఆడి వచ్చాం! | Shekhar gupta writes on olympics | Sakshi
Sakshi News home page

‘అయినప్పటికీ’ ఆడి వచ్చాం!

Published Sat, Aug 27 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

‘అయినప్పటికీ’ ఆడి వచ్చాం!

‘అయినప్పటికీ’ ఆడి వచ్చాం!

జాతిహితం
ఇలాంటి అనుభవాన్ని మీ చుట్టూ ఉన్న జీవితం నుంచి మీరు ఎన్నో గమనించవచ్చు. కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు చోటుచేసుకున్న ఉదంతాలలో ఒకటి వాటిలో చెప్పుకోదగిన దనిపిస్తుంది. అప్పుడు సైన్యం తక్కువైందని అనేవారు. అయినా మనకు ఉన్న బలంతోనే మేం పోరాడతాం అంటూ నాటి సైన్యాధ్యక్షుడు వీపీ మాలిక్‌ పేర్కొన్నారు. అయితే ఒకటి, భారత దళాలకు కల్పించిన వసతులు పాకిస్తాన్‌ సైన్యం కంటే కనాకష్టంగా ఏనాడూ లేవు. ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం కార్గిల్‌లో విజయం సాధించాం.

సామాన్యత మీద మన భారతీయులకి ఉన్న సమష్టి ఆపేక్ష అలాంటిది మరి! పైగా ఆ సామాన్యతని సమర్ధించుకోవడానికీ, దానిని వ్యక్తం చేయ డానికీ అవసరమైన ప్రతిభా సామర్ధ్యాలను సంతరించుకోవడానికి ఇంగ్లిష్‌ భాషను నమ్ముకుంటాం కూడా. ఇంగ్లిష్‌లో ‘ఇన్‌ స్పైట్‌ ఆఫ్‌’ అన్న ప్రయోగం ఉంది (అంటే ‘అయినప్పటికీ’). దీనిని మనం ధారాళంగా ప్రయోగిస్తూనే ఉంటాం. ఆ పద ప్రయోగం ఉన్నదే మన కోసమే అన్నట్టు భావిస్తాం. అందుకోసం ‘ఇన్‌స్పయిట్‌ ఆఫ్‌’ అంటూ మనదైన ఒక ఉచ్ఛారణని కూడా సొంతం చేసుకున్నాం.

రియో ఒలింపిక్స్‌ తరువాత గడచిన రెండు వారాలుగా ‘ఇన్‌ స్పైట్‌ ఆఫ్‌’ (నన్ను మాత్రం ఆ మాట అసలు రూపంతో ఉచ్చరించడానికి అను మతించాలి) అనే పదబంధం మీద మనకున్న లౌల్యం ఎంతటిదో క్రీడా రంగం ద్వారా తిరుగులేకుండా రుజువైంది. రియోలో మనం సాధించినవి చాలా పరిమిత విజయాలే. ఒక రజిత పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆశించడానికి కూడా వీలులేని ఒక విభాగం (జిమ్నాస్టిక్స్‌)లో నాలుగో స్థానం వచ్చింది. పురుషుల మారథాన్‌ పరుగు పందెంలో ఇద్దరు చూపిన ప్రతిభ తప్ప, మిగిలిన విభాగాలు వేటిలోనూ మన చిరునామా లేదు.


ఇదే మారథాన్‌ మహిళల విభాగంలో ఒక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల మారథాన్‌ పరుగు పందెంలో 157 మంది పాల్గొంటే భారత్‌ తరఫున పాల్గొన్న క్రీడాకారిణికి 89వ స్థానం లభించింది. ఆమె రియో ఒలింపిక్స్‌కు ఎంపిక కావడానికి భారతదేశంలో స్థాపించిన రికార్డు సమయం కంటే 13 నిమిషాలు వెనుకపడింది. అయినా ఆ స్థానం లభించడం గొప్ప. ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత, పరుగు తీస్తున్నంత సేపు తనకు మంచినీరు అందించలేదని ఆరోపించారు. గొంతెండిపోయి ప్రాణం పోయి నంత పనైంది. చూడబోతే ఇది పూర్తిగా విశ్వసించదగిన ఆరోపణే. ఇందుకు ఎలాంటి దర్యాప్తులు అవసరం లేదు. ఆమె చూపిన ప్రతిభ కూడా శంకించ లేనిది. చూడండి! భారత క్రీడాకారుల వాస్తవ చిత్రం ఇది. మంచినీళ్లు కూడా అందించని నిర్వాహకుల క్రూర నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తున్నది. ‘అయినప్ప టికీ’ ఆమె ఆ పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. పోటీ కడదాకా నిలిచారు. ఈమెతో పాటు రేస్‌లో పాల్గొన్న మరొక మహిళ తాను రెండు కిలోమీటర్ల వెనుక పడినా నీటి కొరతను ఎదుర్కొనలేదని చెప్పారు. ఇది కాదు కథ. ఈ కథలో ‘అయినప్పటికీ’ అన్న ప్రధాన దినుసు లేదు. ఈ పదబంధాన్ని మిగిలిన విభాగాలలో ఎదురైన వైఫల్యాలకి విరివిగానే ఉపయోగించారు.

మన షూటర్లకు అవసరమైన ప్రత్యేకమైన ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకోవడానికి అక్కడ నిరాకరించారు. అయినా వారు ఏదో కొద్ది సాధించారు. మన రెజ్లర్లకు సరైన ఏసీ సౌకర్యం కలిగిన బస ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ వారు పోటీ పడ్డారు. జిమ్నాస్ట్‌ విభాగంలో పాల్గొన్న బాలిక దేశ ప్రజల దృష్టిలో ఒక కథా నాయికగా నిలబడింది. మనకి ప్రొడునోవా (కళాత్మక విన్యాసాలు)ను పరిచయం చేసింది. ఆమెకు కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోయినప్పటికి ఒక బాల ప్రజ్ఞాశాలిగా నిలబడింది. అయితే ఆమె అక్కడ మౌలిక వసతులకు లోటు లేదని, లేదా వాటిని తాను పొందలేదని చెప్పననిఅంటూనే ఉన్నారు.  తమకు అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే తాము పతకాలు తెచ్చేవారమని మన క్రీడాకారులు ఎవరైనా డంబాలు పలికినా వాటిని మనం నమ్మి ఉండేవారం కాదు.


సామాన్యతకు సంబంధించి స్థిరమైన అలంకారం క్రీడలలోనే లభ్య మవుతుంది కాబట్టి నేను ఆ రంగం మీదే దృష్టి పెట్టాను. Ðð క్కిరించే తరహాలో వ్యాఖ్యలు చేయడానికి ప్రసిద్ధిగాంచిన అమెరికా మెయిల్‌ ఆన్‌లైన్‌ జర్నలిస్టు పీర్స్‌ మోర్గాన్‌కు ఆ వ్యాఖ్య చేసినందుకు కృతజ్ఞులమై ఉండాలి. 120 కోట్ల జనాభా ఉన్న దేశానికి కేవలం ఓడిపోయినందుకు ఇచ్చే రెండు పతకాలు దక్కాయని ఆయన వ్యాఖ్యానించాడు. అలా గురకపెడుతున్న సింహాన్ని రెచ్చగొట్టాడు. ఆ వ్యాఖ్యను ఖండించడానికి మనం చేయవలసినదంతా చేశాం. ఆ మాట ఎలా ఉన్నా నా కంటే వయసులో చిన్నదైన నా సహాధ్యాయి ఒక ప్రశ్న వేశారు. ఆమెకు నా కంటే ఎక్కువగానే క్రీడల గురించి తెలుసు కూడా. ఆ ప్రశ్న చాలా చెబుతోంది.


ఆ వ్యాఖ్యలు చేసిన మోర్గాన్‌కు వెర్రా? ఓడిపోయినందుకు ఇచ్చే పతకాలు అంటే అర్థం ఏమిటి? అని ఆమె నన్ను ప్రశ్నించింది. ఓడిపోయి నందుకు ఇచ్చే పతకం అంటే స్వర్ణ విజేత మీద ఓడినందుకు ఇచ్చినది. అందుకే దాని గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. మనం రెండు పతకాలు గెలిచాం. వ్యవస్థ ఎలా ఉన్నా వాటిని మనం గెలిచాం. ఈ విషయం మీద కాస్త విజ్ఞతతో మాట్లాడిన మన దేశీయుడు పీవీ సింధు కోచ్‌ గోపీచంద్‌ మాత్రమే. ఎన్డీటీవీతో మాట్లాడినప్పుడు ఆయన, వచ్చినది స్వర్ణ పతకం కాకపోవడం నిరాశపరిచిందని, ఒక మంచి అవకాశం కోల్పోయామని అన్నారు. నిజానికి క్రీడల పోటీ ప్రపంచానికి సంబంధించినది కాబట్టి నేను వాటినే తీసుకుని ఉత్ప్రేక్షతో చెబుతున్నాను. అక్కడ జరిగిన ప్రదర్శనల గురించి ఎలాంటి శషభిషలు లేని అంకెల రూపంలో వివరిస్తారు. క్రీడలలో విజయం సాధించ లేకపోవడానికి మన భారతీయులం కుంటిసాకులు వెతికినట్టే, అక్కడ కని పించే పోటీతత్వానికీ, ఆడే తీరుకీ ప్రత్యేక నైపుణ్యం అవసరమన్న వాస్తవాన్ని గ్రహించడం అవసరం.


అన్ని రంగాలలోను సామాన్యత్వాన్ని అతి సులభంగా ఆశ్రయించడం భారత్‌కు ఉన్న శాపం. విద్యారంగం, పరిపాలన, విజ్ఞానశాస్త్రం, వ్యాపారం ఆఖరికి సైన్యంలో కూడా కుంటి సాకులు చెప్పడం కనిపిస్తుంది. ఒక పరీక్షలో ఉన్నత స్థానం సాధిస్తే దానిని మనం విద్యాపరమైన నైపుణ్యంగా పేర్కొంటాం. ఆ పరీక్ష రాసిన తరువాత మంచి ఉద్యోగావకాశం ఇవ్వగల పెద్ద సంస్థలో ప్రవేశించాలి. పెళ్లి మార్కెట్‌లో మంచి రేటు పలికి మంచి జీవితం గడపాలి. ఈ సూత్రాన్ని పాటించని అభ్యర్థుల మీద ఈ మధ్య బొంబాయి ఐఐటి నిషేధం విధించింది. ఇలాంటి పని ఈ మధ్య కొందరు కొత్తగా చేరిన అభ్యర్థులు చేశారు.


స్వాతంత్య్రం తెచ్చుకోవడానికి ముందున్న తరం కాకుండా, లేదా భాభా, విక్రమ్‌ సారాభాయి తరం తరువాత పదునైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మనకి ఉన్నారని. ప్రపంచమంతా గుర్తించిన పేటెంట్‌ హక్కు కలిగిన వస్తువును కనుగొన్నారని చెప్పుకొని సంతోషించగల సాంకేతిక నిపుణులు లేనేలేరు. అయితే బోస్‌ స్పీకర్లు ఇందుకు మినహాయింపు. ఆ తరువాత భారత్‌ ఎలాంటి బ్రాండ్లు ఆవిష్కరించకుండానే, దాదాపు ఎలాంటి యాజమాన్య స్థాయి లేకున్నా కేవలం ఔట్‌సోర్సింగ్‌తోనే  సాఫ్ట్‌వేర్‌ రంగంలో బలమైన శక్తిగా ఆవిర్భవించిన సంగతి ప్రపంచానికి చాటాం. భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం మార్కెట్‌. అలాగే టెలికామ్‌ సేవలను వినియోగించుకునే అతి పెద్ద మార్కెట్‌ కూడా.

అయితే దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్‌ పట్టభద్రులు, వేలాదిగా ఉన్న ఐఐటియన్లు అసలు సిసలు మొబైల్‌ ఫోన్‌ నమూనాలను ఎప్పుడూ రూపొందించలేదు. కనుగొనడం లేదా ఉత్పత్తి చేయడం కూడా చేయలేదు. కానీ చైనా, కొరియా యువతరం ఆ పని చాలా కాలం నుంచి చేస్తోంది. ఎందుకంటే వారి ముందు ప్రధానంగా ఉన్న సవాలు కేవలం ఇంజనీరింగ్‌ డిగ్రీ సంపాదించుకోవడం లేదా దానితో వచ్చే ఉద్యోగం మాత్రమే కాదు. అయితే ఇక్కడ మాత్రం సామాన్యతనే అతి సులభంగా ఆశ్రయిస్తున్నారు. ఏపీజే అబ్దుల్‌ కలాం 1960ల నాటి క్షిపణి శాస్త్రంలో దేశమంతటికీ హీరోగా నిలిచారు. అది భారత్‌కు నిజమైన విజయం. మరి సైన్స్‌లో ఇలాంటి విజయం ఎక్కడ? ప్రపంచం ఎంతో ముందుకు వెళ్లినా ఇస్రో ఇప్పటికీ తన పీఎస్‌ఎల్‌వీతోనే కాలక్షేపం చేస్తున్నది. ఆయా దేశాలు పశ్చిమ దేశాల ప్రతి కూలత నేపథ్యంలో కూడా ఆ ప్రగతినంతా సాధించగలిగాయి.


ఒలింపిక్స్‌లో పాల్గొన్న దేశాలు తలా ఒక్కంటికి ఎన్ని పతకాలు సాధిం చాయో తరువాత చర్చ జరిగింది. పతకాల జాబితాలో భారత్‌ అట్టడుగునే ఉండిపోయింది. కనుగొన్న వస్తువులు, పేటెంట్లు వంటి వాటి విషయంలో దేశాలు సాధించిన విజయాల జాబితాను తయారుచేసినా, మన లక్షలాది ఇంజనీర్లు, సైన్స్‌ పట్టభద్రులు మన దేశ స్థానాన్ని ఆ జాబితాలో చిట్టచివరకే పరిమితం చేస్తారు. కానీ వీరంతా అనేక అవరోధాల ఉన్నప్పటికీ తమ డిగ్రీలను మాత్రం సాధించుకుంటారు. ఉద్యోగ అర్హత సాధించా మంటారు.

ఇక్కడే ప్రఖ్యాత వ్యంగ్య రచయిత పీజే ఒరూర్కే రాసిన ఒక విషయం గురించి గుర్తు చేస్తాను. ఆయన ఇండియాలో పర్యటిస్తూ కోల్‌ కతాలో దిగినప్పుడు ‘ది టెలిగ్రాఫ్‌’లో వచ్చిన ఒక వార్తను బట్టి ఈ చురక వేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్సు పట్టభద్రులు ఉన్న దేశం భారత్‌ అంటూ ది టెలిగ్రాఫ్‌ మొదటి పేజీలో ఒక వార్త వెలువడింది. తరువాత పీజే జనరల్‌ పోస్టాఫీసుకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బల్లల మీద కూర్చుని ఎందరో ఉత్తరాలు రాయడం కనిపించింది. అంటే నిరక్షరాస్యులైన వారికి ఉత్తరాలు రాస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్స్‌ పట్టభద్రులు ఉన్న దేశంలో ఈ రాత లేమిటని పీజే అడిగారు. అందుకు ఇది సమాధానం కావచ్చు. దేశంలో చాలామంది నిరక్ష రాస్యులు ఉన్నప్పటికీ మనం ఎందరో సైన్స్‌ పట్టభద్రులను కూడా కలిగివున్నాం.


ఇలాంటి అనుభవాన్ని మీ చుట్టూ ఉన్న జీవితం నుంచి మీరు ఎన్నో గమనించవచ్చు. కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు చోటుచేసుకున్న ఉదం తాలలో ఒకటి వాటిలో చెప్పుకోదగిన దనిపిస్తుంది. అప్పుడు సైన్యం తక్కు వైందని అనేవారు. అయితే మనకు ఉన్న బలంతోనే మేం పోరాడతాం అంటూ నాటి సైన్యాధ్యక్షుడు వీపీ మాలిక్‌ పేర్కొన్నారు. అయితే ఒకటి, భారత దళాలకు కల్పించిన వసతులు పాకిస్తాన్‌ సైన్యం కంటే కనాకష్టంగా ఏనాడూ లేవు. ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం విజయం సాధించాం.


మళ్లీ క్రీడల దగ్గరకి వద్దాం. రియోలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన మన ఏడుగురు క్రీడాకారులు (పతకాలు తెచ్చిన ఇద్దరు సహా) మామూలుగా వారికి ఉన్న సీడింగ్‌ని బట్టి చూసినా అసాధారణమైన ప్రతిభాపాటవాలనే ప్రదర్శించారు. గొప్ప ప్రతిభను ప్రదర్శించాలన్న తృష్ణ వారందరిలోనూ కనిపించింది. పదో నెంబర్‌ సీడ్‌గా ఉన్న మన క్రీడాకారిణి పోటీలో రెండో నెంబర్‌ సీడ్‌గా ఉన్న క్రీడాకారిణిని ఓడించింది. తుది మ్యాచ్‌లో ఒకటో నెంబర్‌ సీడ్‌తో తలపడింది. మన రెజ్లర్‌ చూపిన ప్రతిభ కూడా అద్భుతం. 0.5 స్కోరుతో వెనుకబడినప్పటికీ చివరి ఎనిమిది సెకన్లలో ఆ స్కోరును తలకిందులు చేసి పతకం గెలిచిందామె. దీనిని బట్టి చూస్తే బుడిబుడి ఏడుపులు వినిపించే వాళ్లు కొద్దిమందే. బాధపడిన వారు ఎవరంటే చక్కని ప్రతిభను ప్రదర్శించినా పతకం రానివాళ్లు. కాబట్టి భారతీయుడు కాని మోర్గాన్‌ చేసిన వ్యాఖ్య సబబైనదే.

శేఖర్‌ గుప్తా
-twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement