తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలన్న దశాబ్దాల కలను సాకారం చేయడంలో ఒక ముఖ్య పాత్రధారిగా నిలిచిన తెలంగాణ విద్యావంతుల వేదికకు పది వసంతాలు. ఆ సందర్భంగా ఐదవ రాష్ట్ర మహాసభలను జరుపుకుంటోంది. హైదరాబా ద్‌లో ‘వట్టికోట ఆళ్వార్‌స్వామి ప్రాంగణం’లో (పబ్లిక్ గార్డెన్స్), ఈ నెల 10, 11 తేదీలలో ‘భాగ్య రెడ్డి వేదిక’లో (ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం) జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
తెలంగాణ విద్యావంతుల వేదిక పుట్టుకకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. 1953లో మొదలైన ‘నాన్‌ముల్కీ గో బ్యాక్’ ఉద్యమం నుండి 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమం వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటాలన్నిట్లోనూ తెలంగాణ ప్రజ లు పాలకుల అణచివేతకు గురయ్యారు, నాయక త్వపు నమ్మకద్రోహంతో దగాపడ్డారు. నక్సల్బరీ తదుపరి జగిత్యాల, సిరిసిల్ల జైత్రయాత్రతో మొదలై విప్లవోద్యమం దేశాన్ని చుట్టుముడుతున్న తరు ణంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా సాగించిన అణచివేతకు తెలంగాణ మరోసారి నలిగిపోయింది. 1996లో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం రూపంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ముందుకు వచ్చిం ది కానీ చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రజాసంఘం పనిచేయలేని స్థితి నెలకొంది. ప్రజాసమస్యలపై నిలదీసినా నక్సలైట్ల ముద్రవేసి అణచివేశారు. ‘తెలంగాణ’ పదాన్ని అసెంబ్లీలో నిషేధించే దుర్మార్గమూ సాగింది. ఫాసిస్టు అణచివే తకు విప్లవోద్యమం వెనుకపట్టు పట్టిన నేపథ్యంలో 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఒక రాజకీయపార్టీ ఏర్పడింది. అది స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టాయి. 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భం గా తెలంగాణ విద్యావంతులు, ప్రొఫెసర్లు, మేధా వులు జరిపిన సమాలోచన నుండి, అమరుడు ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ విద్యావంతుల వేదిక పురుడుపోసుకుంది. వేదిక ఊరూరూ తిరిగి తెలం గాణ దోపిడీకి గురవుతున్న తీరును విప్పిచెప్పి, బుద్ధి జీవులను మేల్కొల్పింది.
తెలంగాణ సమస్య లను ప్రజల ఎజెండా మీదికి తెచ్చింది. పదేళ్ల ప్రస్థా నంలో లక్షలాది కరపత్రాలను ప్రచురించింది. వేలా దిగా సదస్సులను సమావేశాలను నిర్వహించింది. సుమారు 20 పుస్తకాలను ప్రచురించి భావవ్యాప్తిని సాగించింది. ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన పాటను తెలంగాణ విద్యావంతుల వేదిక బొగ్గు పోరాటాల నిలయం శ్రీరాంపూర్‌కు, కరీంనగర్‌కు మోసుకొచ్చింది. (తెలంగాణ ధూం ధాం). ప్రజా సమస్యలను సైతం వెలుగులోకి తెస్తూ వేదిక తెలం గాణ రాష్ట్రం కోసం నిర్విరామ కృషి సాగించింది. తెలంగాణ ఉద్యమం ప్రచార దశ దాటి పోరా ట దశకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ విద్యా వంతుల వేదిక ముందు నిలిచి, జేఏసీలో ముఖ్య పాత్రను పోషించింది. తెలంగాణ రాష్ట్ర జేఏసీకి, జిల్లా జేఏసీలకు 90 శాతం విద్యావంతుల వేదిక కార్యకర్తలే నాయకత్వం వహించారు.
రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో వేదిక నిర్వర్తించాల్సిన పాత్ర గురించి నాగార్జునసాగర్‌లో ‘సాగర్ సమాలోచన’ జరిపి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలను చర్చించింది. ప్రజలు కోరుకున్నది దోపిడీ తెలంగాణ కాదు, అన్నపూర్ణ తెలంగాణ, సుభిక్ష తెలంగాణ, సామాజిక తెలం గాణ, ప్రజాస్వామ్య విలువలుగల తెలంగాణ సాధన కోసం తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజల తరపున నిలబడుతుంది. ప్రజల ఆకాంక్షల కోసం ముందు ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ‘ప్రగతి కోసం, ప్రజాస్వామ్యం కోసం, పైసలో భాగం, పాలనలో భాగం’ అనే నినాదాలతో వేదిక తన ఐదవ మహాసభలను నిర్వహిస్తోంది. తెలం గాణ రాష్ట్రం దేశానికే చుక్కాని కావాలని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభలను విజయ వంతం చేయాలని కోరుతున్నాం.
- గురిజాల రవీందర్‌రావు
తెలంగాణ విద్యావంతుల వేదిక
రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర 5వ మహాసభల కన్వీనర్
తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదవ రాష్ట్ర మహాసభలు
Published Sat, Jan 10 2015 12:37 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement