దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’ | World Radio Day | Sakshi
Sakshi News home page

దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’

Published Thu, Feb 13 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’

దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’

 ఎఫ్‌ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలిసిరావడంతో - ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో - అటు టెలివిజన్‌నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది.
 
 సమాచార వ్యవస్థలో రేడియో తొలి సంచల నమే. వార్తాపత్రికను మించిన సౌలభ్యం, టీవీ చానల్‌కు అతీతమైన సౌకర్యం రేడియోలో సాధారణ మానవుడికి లభించింది. అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆదరణ తగ్గలేదు. పత్రికారంగం కొత్తరూపు దాల్చింది. పరిధి పెంచుకుంది. టీవీ చానళ్ల హవా చెప్పక్కర్లేదు. అయినా రేడియో జనమాధ్యమంగా తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఎన్నో కారణా లు కనిపిస్తాయి. సమాచార వ్యవస్థలో ప్రజా స్వామ్యానికి పెద్దపీట వేసిన వ్యవస్థ ఇది. సరి హద్దులు ఆపలేవు. రేడియో మన వెంట వచ్చే ప్రత్యక్ష ప్రసారం.
 
 2012 నుంచి ప్రతి యేటా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపు కుంటున్నారు. 1946 ఫిబ్రవరి 13 ఐక్యరాజ్య సమితి రేడియో మొదలైన తేదీ. ఈ కారణం గా ఫిబ్రవరి 13 తేదీని రేడియో దినోత్సవానికి ఎంపిక చేశారు. 2011 సెప్టెంబర్ 28న యునె స్కో 36వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకు న్నారు. 2012 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సందర్భంగా రేడియో మాధ్యమం ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.
 
 ధనిక దేశాలకు కాకుండా ఇతర దేశాలకు రేడియో చాలా రకాలుగా తగిన మాధ్యమం. కేవలం మీడియం లేక పోతే షార్ట్ ప్రసారాలు ఉన్నప్పుడు- కేటా యింపులలో అగ్ర దేశా ల దోపిడీ ఉండేది. ఎక్కువ ఫ్రీక్వెన్సీలు వారు తీసుకోవడమే కాక, అత్యంత శక్తిగల ప్రసారాలు చేసేవి. దీనితో తక్కువ శక్తి గల ప్రసారాలకు ఆటంకాలుగా ఏర్పడేవి. ఈ సమ స్యకు పూర్తిస్థాయి పరిష్కారం ఎఫ్‌ఎం (ఫ్రీక్వె న్సీ మాడ్యులేషన్)తో లభించింది. వాతావర ణం దెబ్బతీయని ప్రసారం ఎఫ్‌ఎంతో సాధ్య మైంది. అలాగే ప్రయాణం చేస్తూ రేడియో వినే సదుపాయం కలిగింది. 1995లో మన అత్యున్నత న్యాయస్థానం గొప్ప తీర్పు చెప్పి ఫ్రీక్వెన్సీలు ప్రజల పరం కావాలని వక్కాణిం చింది. ఇది మన దేశ రేడియో ప్రసారాలలో పెద్ద మలుపు. ఎంతో మంది ప్రైవేట్ రేడియో ఆపరేటర్లు ప్రవేశించారు. వీరంతా పత్రిక, టెలివిజన్ రంగాలలో తల పండినవారు. మిర్చి, మ్యాంగో, చాకొలెట్, ఫీపర్ వంటి పూర్తి స్థాయి వాణిజ్య స్థాయి కార్యక్రమాలతో ఈ రేడియో ప్రసారాలు రాణిస్తున్నాయి.
 
 మనిషికి చాలా అనువైన జనమాధ్యమం - రేడియో! టీవీ చానళ్లకు రేడియో సౌలభ్యం ఉండదు. వార్తా పత్రి కలు చదవాలంటే చదు వురావాలి. పత్రిక అం దుబాటులోకి రావాలి. అప్పుడే  వార్తాపత్రిక పఠనమైనా  సాధ్యం కాగలదు. ఆ రెండు మాధ్యమాలతో పోలిస్తే రేడియోకు దినసరి ఖర్చు చాలా తక్కువ! పైగా పని పాడు చేసుకోకుండా రేడియో ప్రసా రాలు వినవచ్చు. రేడియో చాలా చౌక అయిన, సరళమైన సాంకేతిక అద్భుతం. వినడం ఎంత తేలికో, కార్యక్రమాల నిర్మాణం కూడా అంతే తేలిక! ఒక్క మనిషే కార్యక్రమం రూపొందిం చి, ప్రసారం చేయగల సదుపాయం ఉంది.
 
 ఇలాంటి సౌలభ్యాలు రేడియోకు పుష్క లంగా ఉన్నాయి కనుక ఇంత పోటీలో కూడా రేడియో నిలబడింది. ఉపగ్రహ ప్రసారం సాధ్యం కావడంతో రేడియో ప్రసారాల నాణ్య త దెబ్బతినలేదు. ఎఫ్‌ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలసిరావడంతో- ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో- అటు టెలివిజన్‌నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. ప్రత్యక్ష ప్రసారాల్లో టెలిఫోన్ కలసిపోవడం అనేది ఒక సాంకేతిక అంశం కూడా; దాని ఫలితంగా సాధ్యమైన రేడియో కార్యక్రమాల సృజనాత్మక అద్భుతం. ఇది ప్రజాస్వామిక ధోరణికి దారితీసింది. రేడియో ప్రసారాలు కేవలం నాలుగు గోడల మధ్యనే పరిమితం కాక, వ్యవసాయ క్షేత్రం లోనో, వంటింట్లోనో, కర్మా గారంలోనో ఉండే వ్యక్తి రేడియో కార్యక్ర మంలో పాలుపంచుకునే వీలు కలిగింది. కొం దరే మాట్లాడాలనే నియమాన్ని అధిగమించి, ఎవరైనా మాట్లాడగల సదుపాయం ఇచ్చింది.
 
 ఒకటి మాత్రం వాస్తవం. పొలంలో పని చేసే రైతుకూ, ఇంట్లో పాడి చేసుకునే గృహి ణికి, కార్యరంగంలో శ్రమిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు, విద్యాలయంలో చదువు కునే విద్యార్థికీ తోడ్పడే ప్రసారాలు ఇందులో తక్కువే! కొండకోనల్లో సాగిపోయే గిరిజను డికి ఉపయోగపడే రేడియో ప్రసారాలు రాగ లవా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కు వ భావనాశక్తికి దోహదపడే రేడియో మాధ్య మాన్ని మరింత ప్రయోజనకరంగా, సృజనా త్మకంగా వినియోగించడానికి ప్రపంచమంతా ఆలోచించాలి! దీనికి ప్రపంచ రేడియో దినో త్సవం చక్కని సందర్భం.
 
 డా. నాగసూరి వేణుగోపాల్ (వ్యాసకర్త ఆకాశవాణి ఉద్యోగి, రచయిత)
 (ప్రపంచ రేడియో దినోత్సవం నేడు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement