
లిఫ్టర్ గురురాజ్
యశవంతపుర : అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత కీర్తిని చాటి వెండి పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ గురురాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ. 25 లక్షల నగదుతో పాటు ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ప్రమోద్ మద్వరాజ్ తెలిపారు. గురువారం ఆయన ఉడిపిలో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే గురురాజ్‌కు ఏకలవ్యం ప్రశస్తితో సన్మానించినట్లు చెప్పారు. దేశ కీర్తిని విదేశాలలో రెపరెపలాడించిన గురురాజ్ వెండి పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.