సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ వర్గాలకు సముచిత రీతిలో టికెట్లు కేటా యించాలని టీపీసీసీ ఎన్నికల వ్యూహ, ప్రణాళిక కమి టీ సూచించింది. శుక్రవారం కమిటీ చైర్మన్ వి.హను మంతరావు అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమా వేశంలో ఇతర పార్టీలతో పొత్తుల పర్యవసానాలు, పార్టీకి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు, అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చ జరిగింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సభ్యులు నగేశ్ ముదిరాజ్, ఎంఏ ఖాన్ తదితరులు హాజర య్యారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలకు 2 సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవా లని వీహెచ్ సూచించారు. అనంతరం కొత్తగా చేరేవారి కన్నా పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యమివ్వా లని, చేరికల సమయంలో టికెట్ల గురించి హామీ ఇచ్చి చేర్చుకోవద్దని పలువురు సభ్యులు కోరారు. పొత్తుల్లో భాగంగా వదులుకోవాల్సిన స్థానాల్లో ఉన్న పార్టీ నేతలను పిలిచి మాట్లాడాలని, అసంబద్ధ పొత్తు లను నివారించేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకో వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని సూచించింది.