
న్యూఢిల్లీ: ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మృతిపట్ల బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. ‘శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రఖ్యాత తార. ఆమె బాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళం వంటి ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించి.. దేశ ఐక్యతలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సినిమాకు ఆమె ప్రతీకగా నిలిచారు. ఆమె కృషి ఎల్లలు లేనిది’ అని ఆయన పేర్కొన్నారు. తనకు నచ్చిన ఎన్నో సినిమాల్లో శ్రీదేవి నటించారని పేర్కొన్నారు.
ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో భర్త బోని కపూర్, కూతురు ఖుషి ఆమె పక్కనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment