న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టాయి. గాంధీకి నిజమైన వారసులం తామేనని ఆ రెండు పార్టీలూ చెప్పుకున్నాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో కమలం శ్రేణులు షాలీమార్ బాఘ్‌లో ‘గాంధీ సంకల్ప యాత్ర’ చేపట్టగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వరకు ‘గాంధీ సందేశ్ యాత్ర’ చేపట్టారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ లక్నోలో పాదయాత్ర చేపట్టనున్నారు. బీజేపీ నేత స్వామి చిన్మయానందపై రేప్ అభియోగాలు మోపిన లా విద్యార్థినికి మద్దతుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన ప్రియాంకను మంగళవారం యూపీ పోలీసులు అడ్డుకొనిఅదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లక్నోలోని షహీద్ పార్కు నుంచి జీవోపీ పార్కు వరకు ప్రియాంక పాదయాత్ర నిర్వహించి.. మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇన్నాళ్లూ బీజేపీ, ఆరెస్సెస్ జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ గొప్పతనాన్ని గుర్తించడానికి నిరాకరించారని, ఇప్పుడు గాంధీ గురించి అవి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ విజమయని గుజరాత్ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పుకొచ్చారు. గాంధీ వారసులము తామేనని ప్రకటించుకోవడానికి గుజరాత్‌లో కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment