
కోల్‌కతా : సీఏఏను వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. మమతా దీదీ మీరు మన శరణార్ధుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన నిలదీశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ మమతా బెనర్జీ కేవలం చొరబాటుదారుల క్షేమం కోసమే పాకులాడుతున్నారని, శరణార్ధుల్లో భయం రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు.
పొరుగుదేశాల నుంచి లైంగిక దాడులు, హత్యా బెదిరింపులతో మన దేశాన్ని ఆశ్రయించిన హిందువులకు పౌరసత్వం ఇస్తే తప్పేంటని షా నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శరణార్ధులకు సీఏఏ వరం లాంటిదని భరోసా ఇచ్చారు. సీఏఏను మమతా బెనర్జీ అడ్డుకోలేరని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment