ముంబై: దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయి. అందుకే ఆ పార్టీ మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకీ కాల్షీయం ఇంజెక్షన్‌లు ఇచ్చినా దండగే’ అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా అసదుద్దీన్ విమర్శల వర్షం కురిపించారు.
ఇక మీదట ఎవరైనా వ్యక్తి మతం మార్చుకోవాలంటే.. నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒవైసీ దీనిని ఉంటకిస్తూ.. హిమాచల్‌కు మాత్రమే పరిమితమైన ఈ బిల్లును మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment