Calcium Feed
-
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
చిన్నారుల ఆరోగ్యానికి పాలు...
యూనివర్సల్ హెల్త్ డ్రింక్ ప్యాకేజీలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి బి1, బి2, బి12, విటమిన్లతో పాటు విటిమిన్ డి కూడా ఉంటుంది. తీపి పదార్ధాలతో పాటు అనేక డైరీ ఉత్పత్తులకు మూలం పాలు కాబట్టి.. వీటి వినియోగం అనేక లాభాలను అందిస్తుంది. పిల్లలకు పాల అవసరంపై పోషకాహార నిపుణులు, సిథ్స్ఫార్మ్స్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి చెబుతున్న విశేషాలివే... అత్యుత్తమ పోషకాలు... పాలలో పొటాషియం మరియు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎదుగుదల దశలో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. పాలు అనేది అన్ని పోషకాలను కలిగి ఉన్న ఏకైక పానీయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో పాల వినియోగం తగ్గితే అది వారి 1.9% తక్కువ ఎదుగుదలకి దారితీస్తుంది. అలాగే పాలు తాగిన పిల్లల బరువు, ఎత్తులో తాగని వారితో పోలిస్తే 20% అధిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అధ్యయనాల సారాంశం.. పిల్లలలో పాల వినియోగం ప్రభావాన్ని గుర్తించే అధ్యయనాలెన్నో వెలువడ్డాయి. పాలను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందని ఫోర్టిఫైడ్ మిల్క్ ప్రోగ్రామ్ తేల్చింది. పిల్లలలో దృష్టి లోపాన్ని తగ్గించడంలో పాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి. పాలను ఎక్కువగా తాగడం ఐక్యు స్థాయిలలో గణనీయమైన మెరుగుదల, ఆటలు వంటి శారీరక శ్రమలపై వారికి ఆసక్తిని పెంచుతుందని కూడా ఇవి స్పష్టం చేశాయి. ఉత్పత్తిలో మిన్న కానీ... పాల ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు అయినప్పటికీ 2018 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది పిల్లలలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో పాల ప్రాముఖ్యత, పోషక విలువల దృష్ట్యా ఎన్డిబిబి ఫౌండేషన్ ఫర్ న్యూట్రిషన్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని ట్రస్ట్ బలవర్థకమైన ఫ్లేవర్డ్ మిల్క్ ను ప్రవేశపెట్టింది. చిన్న పిల్లలకు ఆహారంగా పాలప్రాముఖ్యత తెలియజెప్పేలా ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్ 1ని ప్రపంచ పాల దినోత్సవంగా ప్రకటించింది. – తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను, నాణ్యమైన ప్రోటీన్ అందించే గొప్ప వనరు పాలు. ఇది వయస్సు–సంబంధిత కండర నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది – కఠిన వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి సహకరిస్తుంది. –విటమిన్ డి, విటమిన్ కె, ఫాస్పరస్, మెగ్నీషియంతో సహా కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి పాలు శరీరానికి సహాయపడతాయి. – బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం ఊబకాయం ప్రమాదాన్ని నివారిస్తుంది కూడా. – పాలు అందరికీ నప్పకపోవచ్చు. వీరి కోసం నాన్–డైరీ మిల్క్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. – పాలను 3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికిస్తే.. విలువైన పోషకాలను కోల్పోతుంది. – ప్లాస్టిక్ డబ్బాల్లో పాలను నిల్వ ఉంచడం లేదా మైక్రోవేవ్ చేయడం అనేవి క్యాన్సర్ కారకాలు. –కిషోర్ ఇందుకూరి, పోషకాహార నిపుణులు -
Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..
ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్, ఎముకలు, కండరాల సంబంధిత సమస్యలు.. వృద్ధులకు మాత్రమేకాకుండా అన్ని వయసుల వాళ్లు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణం కాల్షియం తీసుకోవడం ప్రధమ సలహా. అయితే, ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. ప్రొటీన్లు, విటమిన్ ‘డి’లు కూడా బలమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజు సూద్ ఎముకలకు పుష్టిని చేకూర్చే ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. అరటి పండు జీర్ణ ప్రక్రియలో అరటి పండు పాత్ర ఎంతో కీలకం. దీనిలో మాగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాల నిర్మాణంలో విటమిన్లు, ఇతర మినరల్స్ చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం మూలంగా ఎముకలకు అవసరమైన బలం చేకూర్చడమేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పాలకూర కాల్షియం అధికంగా ఉండే ఆకు పచ్చ కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పుష్టిగా తయారవుతాయి. కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే 25 శాతం వరకు కాల్షియం అందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్ అధికంగా ఉండే పాలకూరలో విటమిన్ ‘ఎ’, ఐరన్ స్థాయిలు కూడా నిండుగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వీటిలో కాల్షియంతోపాటు, మాగ్నిషియం, పొటాషియం కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరమే. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి, నిల్వ ఉండటానికి మాగ్నిషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మీ శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలు 85% ఉపయోగించుకుంటాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు ఎముకల ఆరోగ్యం ప్రస్థావన వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు, పెరుగు, వెన్నవంటి పాల ఉత్పత్తుల ప్రాముఖ్యం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం కప్పు పాలు, పెరుగు రోజూ తీసుకుంటే సరిపడినంత కాల్షియం అందుతుందని పేర్కొంది. ఆరెంజ్ పండ్లు తాజా ఆరెంజ్ జ్యూస్ చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీనిలో పోషకాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. దీనిలోని కాల్షియం, విటమిన్ ‘డి’ ఎముకలకు బలం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. క్రమంతప్పకుండా ఆరెంజ్ పండ్లు తింటే.. ముఖ్యంగా ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. బొప్పాయి దీనిలో కూడా కాల్షియం స్థాయిలు అధికంగానే ఉంటాయి. 100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు చేపల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఫ్రై, కర్రీ, గ్రిల్.. ఏవిధంగా తీసుకున్నా పోషకాలు అందుతాయి. సాధారణంగా 35 ఏళ్ల వరకు మాత్రమే ఎముకల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఎముకలు అరగడం లేదా క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుని, పోషకాహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
‘కాంగ్రెస్‌కు కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా వ్యర్థమే’
ముంబై: దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయి. అందుకే ఆ పార్టీ మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకీ కాల్షీయం ఇంజెక్షన్లు ఇచ్చినా దండగే’ అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా అసదుద్దీన్ విమర్శల వర్షం కురిపించారు. ఇక మీదట ఎవరైనా వ్యక్తి మతం మార్చుకోవాలంటే.. నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒవైసీ దీనిని ఉంటకిస్తూ.. హిమాచల్‌కు మాత్రమే పరిమితమైన ఈ బిల్లును మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అనుమతులు నిల్... అమ్మకాలు ఫుల్!
నర్సాపూర్ కేంద్రంగా వెటర్నరీ మందుల విక్రయాలు నర్సాపూర్ : నర్సాపూర్ కేంద్రంగా అనుమతుల్లేకుండా వెటర్నరీ మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇటీవల జిల్లాలోని రామాయంపేటలో అక్రమంగా పశువుల మందులు అమ్ముతున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేశారు. కాగా, అదే సంస్థకు చెందిన వారు అనుమతులేకుండా గ్రామాలలో పర్యటిస్తూ పాడి రైతులు, మేకలు, గొర్రెల పెంపకందారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరిగి మందులు విక్రయిస్తున్నారు. నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని మందులు స్టోర్ చేశారు. ఇక్కడి నుంచి నిత్యం గ్రామాలకు వెళ్లి రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. వారికి ఈ మందులు అంటకడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి చెందిన ఫీడ్ కాల్షియం మందులతో పాటు పలు రకాల యాంటీబయాటిక్స్‌ను సైతం గ్రామాలకు తరలిస్తున్నారు. కరపత్రాలు ముద్రించి మరీ యథేచ్ఛగా అమ్మకాలు సాగించేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే... డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు అమ్మరాదని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు ఆదేశిస్తున్నా వీరు లెక్క చేయడం లేదు. అనుమతులు, మందుల చీటీలు లేకుండా మందులు విక్రయిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణంలోని పలువురు మెడికల్ షాపుల నిర్వహకులు అధికారులను కోరుతున్నారు. కాగా... కంపెనీ ప్రతినిధి ఆంజనేయులును వివరణ కోరగా... తాము ఫీడ్ కాల్షియం, బయోవిటమిన్ మందులే అమ్ముతున్నామని చెప్పారు. ఇతర మందులు అమ్మడం లేదన్నారు.