
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(పాత చిత్రం)
సాక్షి, మైలవరం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏప్రిల్ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మైలవరంలో కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చంద్రబాబు బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదుగురు ఎంపీలతో పోరాడిన వ్యక్తి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయో, బీసీలకు కూడా ఆ ప్రకారమే ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన శాసనసభ్యులతో బీసీలకు ప్రైవేటు బిల్లు పెట్టేవిధంగా తీర్మానం చేశాడని ప్రశంసించారు. మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ కూడా బీసీల బిల్లు కోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment