సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు నామినేట్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బుధవారం 11 మందితో కూడిన తొలిజాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క రోజుకిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సింధియాకు అవకాశం కల్పించింది. ఆయన స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎంపిక చేసింది. ఆయనతో పాటు 11 తొమ్మది పేర్లను బీజేపీ ప్రకటించింది. అలాగే మిత్రపక్షాలకూ బీజేపీ అవకాశం కల్పించింది.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల తొలిజాబితా..
- జ్యోతిరాదిత్య సింధియా : (మధ్యప్రదేశ్)
- హర్ష్‌సింగ్ చౌహాన్ : (మధ్యప్రదేశ్)
- భువనేశ్వర్ కలిత : (అస్సాం)
- వివేక్ ఠాకూర్ : (బిహార్)
- అభయ్ భరద్వాజ్, రమీలా బెన్ (గుజరాత్)
- దీపక్ ప్రకాష్ : (జార్ఖండ్)
- మహారాజ్ : (మణిపూర్)
- ఉద్యన రాజే భోస్లే : (మహారాష్ట్ర)
- రాజేంద్ర గెహ్లాట్ : (రాజస్థాన్)
- ఆర్ఎస్పీ చీఫ్ రాందాస్ అథవాలే : (మహారాష్ట్ర)
- బీపీఎఫ్ నేత బుశ్వజిత్ : (అస్సాం)
Comments
Please login to add a commentAdd a comment