సాక్షి, అమరావతి: పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురావడంతోపాటు ఏడాదిలోనే 90శాతం హామీలు నెరవేర్చామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. జూలై 8న 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధానపరమైన నిర్ణయాలతోనే కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చారని స్పష్టం చేశారు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే ముందే టీడీపీ నేతలు కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. (చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?: బొత్స)
టీడీపీకి వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యం కానీ వ్యవస్థలు కాదన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ పెద్దలు విధానపరమైన నిర్ణయాలే తీసుకోలేదు, కానీ, పంచభూతాలను దోచుకున్నారంటూ మండిపడ్డారు. ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాలు విసిరారు. కానీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోడానికి టీడీపీకి దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ విధానాలు నచ్చకనే ప్రజలు తిరస్కరించారని మరోసారి గుర్తు చేశారు. 'పేదలకు మంచి జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదా?, పేదలకు మంచి చేస్తుంటే టీడీపీ కోర్టులకు వెళ్లడంలో అర్థమేంటి?' అని మంత్రి వరుస ప్రశ్నలు సంధించారు. (ఎన్నికల కమిషనర్ ‘ఆర్డినెన్స్’ రద్దు)
Comments
Please login to add a commentAdd a comment