
సాక్షి, హైదరాబాద్: కొందరు బడా సంపన్నులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకోసమే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరి స్వలాభాలకోసం పేద విద్యార్థులకు విద్యను భారం చేయనున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
విద్యను ప్రైవేటుపరం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయిందని, అందుకే ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరుస్తున్నదని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగానే ఉండాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు.