నెక్ట్స్ తమిళనాడు సీఎం రజనీనే! | Charuhasan Says Rajini Will Be Next CM | Sakshi
Sakshi News home page

నెక్ట్స్ తమిళనాడు సీఎం రజనీనే!

Published Sun, Apr 29 2018 3:05 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Charuhasan Says Rajini Will Be Next CM - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాట రాజకీయ పరిస్థితులపై ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సోదరుడు చారుహాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. మొదటినుంచి రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశానికి మద్దతుగా మాట్లాడుతున్న ఆయన.. భవిష్యత్తులో సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. రజనీని కన్నడ వ్యక్తిగా వ్యతిరేకిస్తున్న వారందరికీ ఆయన తన విజయంతో సమధానం చెబుతాడని అన్నారు. రజినీతో పొల్చితే తన సోదరుడు కమల్‌కు సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు కమల్‌ని సినిమాలో ఆదరించినంతగా రాజకీయాల్లో ఆదరించకపోవచ్చని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement