రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌కు కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. బుధవారం కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీఎల్పీ భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ప్రతీ ఎమ్మెల్యే అభిప్రాయాన్నీ సేకరిస్తున్నామని ఖర్గే చెప్పారు. అయితే సీఎం ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు రాహుల్‌కే అప్పగించినందున ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ భూపేశ్ భాఘేల్‌తోపాటు మరో సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్‌లు సీఎం రేసులో ముందున్నారు. ఛత్తీస్‌లో 90 సీట్లకుగాను కాంగ్రెస్ 68, బీజేపీ 15, జేసీసీ 5, బీఎస్పీ 2 స్థానాలు గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment